గత 2000 సంవత్సరాల నుండి ఇజ్రాయిలీలకు భారత్ అంటే ఏందుకంత ప్రత్యేక అభిమానమో తెలుసా ???

Share the Post
#Bharatjago :  ఇజ్రాయిల్, భారత దేశాల మద్య సంబందాలు ఈనాటివి కావు, గత 2000 సంవత్సరాల నుండి ఇజ్రాయిలీలు భారత్ తొ గొప్ప సంబందాలు కలిగి ఉన్నారు ….  క్రీస్తు పూర్వం నుండి యూదులు (ఇజ్రాయిలీలు) ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలొ ఊచకొత కొయబడ్దారు. ఏ దేశం కూడా వారికి నిలువ నీడ నివ్వడానికి ఇష్ట పడ లేదు. ఏ ఏ దేశాలలొ ఏంతమంది యూదులు, ఏ విధంగా చంపబడ్దారన్న విషయాలకు సంబందించి ఇజ్రాయిలీలు ఒక అధికారిక గ్రంధాన్ని (పుస్థకాన్ని) నిర్వహిస్తున్నారు.
 
ఈ పుస్తకంలొ ప్రపంచంలొ అన్ని ప్రాంతాలలొ యూదులు ఊచకొతలకు, అవమానాలకు, అంటరానితనాన్ని ఏదుర్కొన్నారు. దీనితొ తాము బతుకు తెరువు కొసం, ఒక దేశం నుండి మరొక దేశానికి వలస వెళ్లవలసి వచ్చేది. ప్రతి దేశం వారిని వ్యతిరేకించగా, ఒక్క భారతదేశపు రాజులు మాత్రమే, ఇజ్రాయిలీలను మన దేశంలొకి సాదరంగా ఆహ్వానించి, అక్కున చేర్చుకున్నారు. వారికి రక్షణ కల్పించి, తమ మత కార్యక్రమాలు చేసుకునే స్వేచ్చను ఇచ్చారు. దాదాపు క్రీస్తు పూర్వం 135 సంవత్సరాల నుండి, రెండవ ప్రపంచ యుధం వరకు యూధుల ఊచ కొత కొనసాగింది.
 
క్రీస్తు పూర్వం 135 సంవత్సరంలొ, తమను తాము దేవునిగా ప్రకటించుకునే గ్రీకు రాజులు వేల మంది యూదులను ఊచకొత కొశారు.
 
క్రీస్తు శకం 70 వసంవత్సరంలొ రొమన్ సామ్రాజ్య నేత టిటుస్, జెరూసలెం ను ఆక్రమించుకుని, అక్షరాల లక్ష మంది యూధులను చంపివేశాడు.
 
136 వ సంవత్సరంలొ ప్రపంచ వ్యాప్తంగా 985 నగరాలలొ 5,80,000 మంది యూదులు వేటాడి చంపబడ్డారు.
 
306 లొ స్పెయిన్, 325 లొ కానస్టాంట్ నొపిల్ రాజ్యాలు యూదులను అంటరానిగా పరిగణించి, తరిమికొట్టాయి.
 
379 లొ సెయింట్ ఆంబ్రొస్, 395 ల్ సెయింట్ గ్రిజొరి లు యూదులను అత్యంత హీనమైనవారిగా చెబుతూ, యూదులు కామాందులని, అత్యంత స్వార్ధ పరులని, జీసన్ క్రైస్టు ను చంపింది యూదులేనని ప్రజలను రెచ్చగొట్టి లక్షకు పైగా యూదుల చావుకు కారనమైనారు.
 
415 లొ బిషప్ సెవర్స్ యూదుల ప్రార్ధనా మందిరాలను తగలబెట్టించి, వారిని అలెక్సాండ్రియా నుండి తరిమి కొట్తడమే కాకుండా, యూదు మహిళలను బానిసలుగా మార్చుకుని, ఇది దేవుని ఆగ్ణ అని ప్రచారం చేసుకున్నాడు.
 
1012, 1096, 1483 సంవత్సరాలలొ జర్మనీ, పొర్చుగల్ దేశాలలొ సహా అనేక దేశాలొ వేల సంఖ్యలొ యూదులను ఊచకొత కొయబడ్దారు. ఈ దాడులలొ లక్షల సంఖ్యలొ యూదుల మరణాలు సంభవించాయి. ఇక 1933 – 1945 వరకు కేవలం యూదులను మాట్రమే టార్గెట్ చేస్తూ, నాజీలు వారి మిత్ర దేశాలు సాగించిన మారణహొమంలొ 60,00,000 మంది యూదులు అత్యంత ఘొరంగా చంపబడ్దారు..
 
క్యాధలిక్కుల తరువాత యూదులు అరబ్బులకు లక్ష్యంగా మారారు. సరిగ్గా 712 సంవత్సరాల నుండి అరబ్బులు తమ మతాచారం ప్రకారం యూదులు దుస్తులు ధరించాలని యూదులను ఊచకొతలు కొయడం మొదలు పెట్టారు. లెక్క లేనన్ని యూదుల మరణాలు సంభవించాయి.
 
మొత్తంగా ప్రపంచంలొ ప్రతి దేశంలొ, ప్రతి చొట హత్యలు చేయబడి, తీవ్ర అవమానాలు, అత్యాచారాలకు గురయిన యూదులను ఒక్క భారతదేశం మాతేమే సాదరంగా ఆహ్వానించి, వారికి అన్ని సౌకర్యాలతొ పాటు రక్షణ కల్పించారు. తరువాత 1948 లొ ఇజ్రాయిల్ దేశ ఏర్పడిన తరువాత భారతదేశంలొ తలదాచుకున్న 99% మంది యూదులు అయిష్టంతొనే భారతదేశం వదిలి ఇజ్రాయిల్ వెళ్ళిపొయారు.
 
అందుకే తమను మనుషులుగా గౌరవించి, తమకు తలదాచుకునేందుకు అవకాశం కల్పించి, రక్షణ కల్పించిన భారతదేశమంటే ఇజ్రాయిలీలకు ప్రత్యేక అభిమానం.
.

One thought on “గత 2000 సంవత్సరాల నుండి ఇజ్రాయిలీలకు భారత్ అంటే ఏందుకంత ప్రత్యేక అభిమానమో తెలుసా ???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!