Big Move : లక్ష కొట్ల Enemy properties ను వేలం వేయనున్న కేంద్ర ప్రభుత్వం

Share the Post
#Bharatjago : అనేక దశాబ్ధాల కాలం తరువాత భారత ప్రభుత్వం, Enemy properties ను వేలం వేయనుంది.  1947 లొ భారత్, పాకిస్థాన్ దేశాలుగా విడిపొయిన తరువాత, భారత్_పాక్ యుధాలు సంభవించిన తరువాత, ఆ తరువాత కాలంలొ భారతదేశాన్ని పూర్తిగా వదిలేసి పాకిస్థాన్, చైనా లకు వెళ్ళి అక్కడి పౌరసత్వం తీసుకుని, అక్కడే స్థిరపడిన వారి ఆస్తులనే Enemy properties అంటారు. మొత్తంగా లక్ష కొట్లకు పైగా విలువ చేసే 9,400 ఆస్తులను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వీటిని స్వాధీనం చేసుకొవడానికి 49 సంవత్సరాల క్రిందటి పాత చట్టాన్ని, మోది ప్రభుత్వం ఈ మద్యకాలంలొ సవరణలు చేసింది.
 
ఈ విషయం గురించి భారత్ హొం శాఖామంత్రి రాజనాధ్ సింగ్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు మొత్తం 9,400 ఆస్తులను గుర్తించామని, అయితే ఆ ఆస్తులన్నీ కబ్జా దారుల స్వాధీనంలొ ఉండగా, ఇప్పటివరకు 6,289 ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన 2,991 ఆస్తులను త్వరలొ స్వాధీనం చేసుకుని వేలం వేస్థామని తెలియజేశారు. ఈ ఆస్తులను సాద్యమైనంత త్వరగా వేలం వేయడం కొసం ఈ ఆస్తుల విలువ, పరిమాణాలను కనుగొనేందుకు ఈ ఆస్తుల మీద ఇప్పటికే నొడల్ ఆఫీసర్లను నియమించామని తెలియజేశారు. మొత్తంగా ఈ ఆస్తుల విలువ లక్ష కొట్లకు పైగా ఉండనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకే ఐదు దశాబ్దాలనాటి చట్టాలని సంవరించామని తెలియజేశారు.
.
 
కాగా పాకిస్థాన్, ఇప్పటికే తమ దేశంలొని భారతీయుల ఆస్తులను Enemy properties ను వేలం వేయగా, భారత్ చాలా కాలం తరువాత ఇప్పుడు ఆ పని చేయనుంది. ఈ Enemy properties లలొ ఏక్కువగా ఉత్తరప్రదేశ్ లొ అత్యధికంగా 4,991 ఆస్తులుండగా, తరువాత పశ్చిమ బెంగాల్ లొ 2,735 ఆస్తులు ఉన్నాయి. అలాగే దేశ రాజధాని న్యూడిల్లీ లొ 487 ఆస్తులు, ఈశాన్య రాస్ట్రాలలొ ఉన్న 126 ఆస్తులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!