మా అంతర్గత విషయాలలొ జొక్యంచేసుకొవడానికి మీరెవరు – రాహుల్ గాంధిని విమర్శించిన బార్ కౌన్సిల్

Share the Post
#Bharatjago : రాహుల్ గాంధికి ఊహించని ఏదురు దెబ్బ తగిలింది.  దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో పరిస్థితులు సజావుగా లేవని, ఎన్నో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రాకు వ్యతిరేకంగా, నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు శుక్రవారం నాడు మీడియా సమావేశం నిర్వ‌హించిన విషయం తెలిసిందే.
 
అయితే తమ రాజకీయ మైలేజి కొసం వెంటనే రంగంలొకి దూకిన రాహుల్ గాంధి, కాంగ్రెస్ లు భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ను అభిశంసన చేయాలని, అన్నీ సజావుగా జరగడం లేదని నలుగురు న్యాయమూర్తులు మాట్లాడటం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, ఇది చాలా సున్నితమైన, ముఖ్యమైన అంశమని రాహుల్ గాంధీ ప్రత్యేక మీడియా సమావేశం పెట్టి చెలరేగి పొయారు. అవకాశం దొరకడంతొ పనిలొ పనిగా మోది, బిజెపి ని కూడా విమర్శించాడు.
.
 
అయితే సుప్రీంకొర్టు న్యాయమూర్తుల మద్య నెలకొన్న ఈ వివాదానికి పులుస్థాఫ్ పెట్టడానికి నిన్న సాయంత్రం మనన్ కుమార్ మిశ్రా ఆద్వర్యంలొ “బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా” సమావేశమై సుప్రీంకొర్టు జడ్జిలు, చీఫ్ జస్టిస్ ల మద్య అంతరాలు తొలగించడానికి ఏడుగురు సబ్యులతొ కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిస్కరిస్థామని,  చెబుతూ, రాహుల్ గాంధి ఈ విషయంలొ జొక్యం చేసుకొవడం గురించి మాట్లాడుతూ …
.
 
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధి, కొన్ని ఇతర పార్టీలు అనవసరంగా ఈ విషయంలొ జొక్యం చేసుకుని రాజకీయం చెస్తున్నాయి. ఇది పూర్తిగా న్యాయవ్యవస్థ కు సంబందించిన అంశం, ఇందులొ రాహుల్ జొక్యం అవసరం లేదు. రాహుల్ గాందీతొ పాటు రాజకీయ పార్టీలు ఈ విషయంలొ దయచేసి జొక్యం చేసుకొకండి.  ఇది పబ్లిక్ గా చర్చించాల్సిన విషయం కా  ఇది మా అంతర్గత సమస్య, మేమే పరిష్కరించుకుంటాము అని విమర్శించారు.
.
కాగా ఈ విషయంలొ భారత ప్రధాని నరేంద్రంద్రమొది, కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ లు ఇది న్యాయవ్యవస్థ అంతర్గత విషయమని, ఈ విషయంలొ తాము జొక్యం చేసుకొబొమని, మీరే పరిష్కరించుకొమని చెప్పారని, అందుకు వారిని అభినందిస్తున్నామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ కుమార్ మిశ్రా తెలియజేశారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!