మనం మరచిన మరొక మహా పురుషుడు “యల్లాప్రగడ సుబ్భారావు” (Miracle Man of Drugs)

Share the Post
#Bharatjago : యల్లాప్రగడ సుబ్బారావు, భారత దేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి.   పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బస్తీలో 1895, జనవరి 12 న జన్మించారు.  మెట్రిక్ లేషన్ పూర్తి చేసిన సుబ్బారావు గారు  తల్లి పట్టుదలతో మద్రాసుకు పంపదల్చగా చేత చిల్లిగవ్వ లేదు. పుస్తెలు అమ్మి కొడుకు చదువుకు ఇచ్చింది.
 
దేశ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో విదేశీ దుస్తులను బహిష్కరించి, ఖద్దరు దుస్తులతో కాలేజీకి వెళ్ళీన ఈయన కాలేజీ అధికారుల ఆగ్రహానికి గురయ్యారు. ఇంతలో మరో దుర్ఘటన జరిగింది. అత్యంత సన్నిహితుడైన పెద్దన్నయ్య పురుషోత్తం భయంకరమైన “స్ఫ్రూ” వ్యాధితో మరణించాడు. ఈ బాధ నుండి కోలుకోలేకముందే, వారం రోజుల వ్యవధిలో మరో సోదరుడు కృష్ణమూర్తి కూడా ఇదే వ్యాధికి బలయ్యాడు. ఈ రెండు మరణాలు ఈయనను తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. ఎంతటి శ్రమపడి అయినా ఈ వ్యాధికి ముందు కనుగొనాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
.
 
ఆర్థిక ఒత్తిడి ఎంతగా ఉన్నా, ఎన్ని అవరోధాలు ఎదురైనా చదువు కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు. మద్రాసు ఇండియన్ మెడికల్ కాలేజీలో ఎల్.ఐ.ఎం. చేసి, అమెరికాకు వెళ్ళీ పరిశోధనలు చేయాలని వైద్యశాస్త్రాన్ని శోధించి, పరిశోధించి అనేక రహస్యాలను వెలికి తీయానల్ల దృఢ కాంక్షను రోజు రోజుకీ బలపరచుకున్నాడు.
 అమెరికాలొ వెళ్ళి, అక్కడి హార్వర్డ్, లెడర్లీ వైద్యపరిశోధనా కేంద్రాలలొ అనేక పరిశొధనలు ప్రారంభించారు.  లెడర్లీ ప్రయోగశాలలో వైద్యబృందం నాయకులుగా ఫోలిక్ ఆమ్లం యొక్క నిజస్వరూపాన్ని కనుగొన్నాడు. అందులోని బంగారు వన్నె భస్మం స్ప్రూ వ్యాధి, మక్రోసైటిక్ అనీమియా అను రక్తహీనత వల్ల కలిగే వ్యాధి నిర్మూలనకు అసమానమైన, అద్భుతమైన మందుగా నిర్ణయింపబడింది. క్షయరోగ నివారణియగు బసోనికోటి నికాసిడ్, హైడ్రాక్సైడ్ మందులను కనుగొన్నారు. బోదకాలు, టైఫాయిడ్, పాండురోగం మున్నగు వ్యాధులకు పూర్తిగా నిర్మూలింపగల మందులను కనుగొన్నాడు.  కేన్సర్ ను నివారించే అతి ముఖ్యమైన మెథొత్రియాక్సైడ్ మందును కనుగొన్నది సుబ్బారావు గారే. ప్రధానంగా దీనిని లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) వ్యాధి నివారణకు ఉపయోగిస్థారు.  ప్రపంచ ఆరొగ్య సంస్థ బొధకాల నివారణకు ఉపయొగించిన హెట్రాజన్ ను తయారు చేసింది సుబ్బారావు గారే.    సుబ్బారావు  గారి  పర్యవేక్షణలో బెంజమిన్ డుగ్గర్ 1945లో ప్రపంచములోనే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ అయిన ఆరియోమైసిన్ను కనుగొన్నాడు.
 
కొత్తగా కనుగొనిన ఒక శిలీంద్రము (ఫంగస్) నకు ఈయన గౌరవార్ధము సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ (Subbaromyces splendens) అని నామకరణము చేశారు. 1947లో అమెరికా పౌరసత్వమునకు అర్హత పొందినా సుబ్బారావు తన జీవితాంతము భారతీయ పౌరునిగానే మిగిలిపోయాడు. తన జీవితమును మొత్తము వైద్య శాస్త్ర పరిశోధనకు అంకితము చేశాడు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!