Modi’s Major Victory : చైనా చేతుల్లొంచి మరలా భారత్ గుప్పిటలొకి వచ్చిన మాల్దీవులు

Share the Post
#Bharatjago : హిందూమహాసముద్రంలొ ప్రపంచ వ్యాపారానికి అత్యంత అనుకూలమైన ప్రాంతంలొ ఉన్న మాల్దీవులు దేశాన్ని Free Trade Agreement ద్వారా, ఋణాల ద్వారా తన గుప్పిట బిగించి … మాల్దీవులకు, భారత్ ను శాశ్వతంగా దూరం చేద్దామనుకున్న #చైనా కుట్రను భారత్ కేవలం నెల రొజుల వ్యవధిలొ విజయవంతంగా అడ్డుకుంది. అంతేకాకుండా మాల్దీవుల ” First India ” ఫార్ములాను మళ్ళీ వెలుగులొకి తెచ్చేలా చేయగలిగింది.
 
మాల్దీవులు అధ్యక్షుడు ఆబ్దుల్ల యామీన్ ను చైనా పర్యటనకు పిలిచి, అతడిని లొంగ దీసుకొని చైనాతొ Free Trade Agreement చేసుకునేలా చేసి, ఈ విషయంలొ మాల్దీవులు ప్రతిపక్షాలకు, ప్రజలకు కూడా చెప్పకుండా ఫార్లమెంట్ లొ ఆ బిల్లు పాస్సయేలా చైనా చక్రం తిప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మాల్దీవులు మీడియా ను చైనా మేనేజ్ చేసి చైనాకు అనుకూలంగా, భారత్ కు వ్యతిరేకంగా వార్తలు వ్రాయించింది. ఈ సంఘటనలతొ బిత్తరపొయిన భారత్, దానిని అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఇందులొ భాగంగా భారత ప్రతినిధులను కలసిన మాల్దీవులు కార్పొరేటర్లను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది (చైనా చేయించింది). దీనితొ మాల్దీవులు, భారత్ ల మద్య తీవ్ర స్థాయిలొ మనస్పర్దలు ఏర్పడ్డాయి.
.

 
ఇక వెంటనే తన ప్యుహాన్ని మార్చుకున్న భారత్, మాల్దీవులు అధ్యక్షుడు యామీన్ ఆంతరంగీకులతొ, భారత్ లొ ఉన్న మాల్దీవులు రాయబారితొ అనేకసార్లు చర్చలు జరిపారు. తరువాత ఏం జరిగిందొ తెలియదుగాని గత వారం రొజుల క్రితం మాల్దీవులు అధ్యక్షుడు యామీన్ తమకు భారత్ ప్రధానమైన మిత్రదేశమని, భారత్ తొ కూడా FTA చేసుకుంటామని, మాల్దీవుల అభివృధి విషయంలొ భారతదేశ పాత్రను ఏప్పటికీ మర్చిపొలేమని, మా పరిస్థిని అర్ధం చేసుకొమని భారత్ కు విగ్ణప్తి చేశాడు.
 
అయితే అందుకు భారత్ శాంతించక పొవడంతొ వెంటనే అధ్యక్షుడు యామీన్, తనకు అత్యంత సన్నిహితుడైన విదేశాంగమంత్రి మహమ్మద్ ఆసిం ను ప్రత్యేక దూతగా, తన తరపున భారత్ పంపారు. భారత్ చేరుకున్న ఆసిం, స్వరాజ్ గారిని, ప్రధాని మోది గారిని కలుసుకుని తమది ఏప్పటికీ First India పాలసీ యేనని, భారత్ కు నష్టం కలిగించే చర్యలెవి చెపట్టబొమని భారత్ తొ ఏటువంటి ఓప్పందాలు చేసుకొవడానికైనా సిధమేనని, ఇందుకు సంబందించిన ఓప్పందాలు చేసుకునేందుకు ప్రధాని మొది గారిని మాల్దీవులకు సవినయంగా అహ్వానించారు. త్వరలొ మాల్దీవులు_భారత్ ల మద్య కీలకమైన ఓప్పందాలు జరగనున్నాయి.
.
 
ఈ సంధర్భంగా మాల్దీవులతొ భారత్  త్వరలొ  అనేక కీలక ఓప్పందాలు చేసుకొనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మాల్దీవులలొ జరిగే ఏన్నికల తరువాత, అనేక మార్పులు జరిగే అవకాశం ఉంది.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!