తిరుగుబాటు చేసిన నలుగురు సుప్రీం కొర్టు జడ్జిలకు ఏదురుదెబ్బ

Share the Post
#Bharatjago : చీఫ్ జస్టీస్ అంటే సమానుల్లొ ప్రధముడు, అంతేకాని జడ్జిలపై అధికారం చెలాయించడానికి కాదు అంటూ సుప్రీం కొర్టు ప్రధాన న్యాయమూర్తి పై తిరుబాటు జెండా ఏగురవేసి, ప్రధాన న్యామూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను అభిశంసన చేయాలని నలుగురు సుప్రీంకొర్టు న్యాయమూర్తులు నిన్న మీడియా సమావేశం పెట్టిన సంగతి తెలిసిందే.
 
అయితే మీడియా సమావేశం పెట్టిన దగ్గర నుండి విమర్శలు ఏదుర్కొంటున్న ఈ నలుగురు సుప్రీం కొర్టు న్యాయమూర్తులు, నిన్న మీడియా సమావేశం పెట్టిన కాసేపటికే కాంగ్రెస్ వీరికి మదత్తు తెలుపుడమే కాకుండా, సుప్రీం కొర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా ను అభిశంసన చేయాలని డిమాండ్ చేయడం, దీనికితొడు నిన్న కమ్యూనిస్టు అగ్రనాయకుడు D. రాజ, నిన్న తిరుగుబాటు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ను కలవడంతొ ఈ విమర్శలు మరింత పెరిగాయి. ఐతే ఇప్పుడు ఈ నలుగురు న్యాయమూర్తులకు ఇపుడు మరొక ఏదురుదెబ్బ తగిలింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను అభిశంసన చేసే ప్రశ్నేలేదని తేల్చిచెప్పుతూ సుప్రీం కొర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షుడు వికాస్ సింగ్ తిరుగుబాటు చేసిన నలుగురు సుప్రీంకొర్టు న్యాయమూర్తులపై విరుచుకు పడ్దారు.
.
 
ఈ సంధర్బంగా సుప్రీంకొర్టు బార్ కౌన్సిల్ వికాస్ సింగ్ మాట్లాడుతూ, ఆ నలుగురు న్యాయమూర్తులు విడుదల చేసిన లేఖలొ ఏ విషయం ఉందని ప్రశ్నించారు. ఏదొ మొక్కుబడిగా ఆ లేఖ విడుదల చేశారు, చూస్తుంటే ఆ నలుగురు న్యాయమూర్తులు రహస్యాలను బయటపెట్టడం కొసం కాకుండా, రహస్యాలను దాచి పెట్టడం కొసం నిన్న మీడియా సమావేశం పెట్టినట్టుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ లేఖలొ Memorandum of Procedure ను పేర్కొన్నారు కాని చీఫ్ జస్టిస్ ఏప్పుడొ దానిని వెనక్కు తీసుకున్నారని తెలియజేశారు. ఆదర్శవంతమైన చీఫ్ జస్టిస్ పై ” The master of the roster ” అంటూ సంభొదించడం ఏంతవరకు సబబు అని ప్రశ్నించారు.
.
 
అసలు నాకు తెలియక అడుగుతున్నాను ఆ లేఖలొ ఏముందని విలేఖరుల సమావేశం పెట్టారొ నాకు అర్ధం కావడం లేదు, బెంచ్ లను ఏర్పాటు చేయడం ప్రధాన న్యాయముర్తిగా ఆయన విధి, భాద్యత. ఆ విషయాన్ని అసలు ఏలా ప్రశ్నిస్థారని ఆశ్చ్యర్యం వ్యక్తం చేశారు. ఆ న్యాయమూర్తుల వ్యాఖ్యల మూలంగా ప్రజలందరికి సుప్రీంకొర్టుపై ఉన్న గౌరవం పొతుందని, దానికి ఏవరు భాధ్యత వహిస్థారని వికాస్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
.

4 thoughts on “తిరుగుబాటు చేసిన నలుగురు సుప్రీం కొర్టు జడ్జిలకు ఏదురుదెబ్బ

 • January 15, 2018 at 1:02 pm
  Permalink

  As A honorable Supreme Court judges, how to attend a Politician’s private party in Vijayawada? They must answer…… It’s clear they are working for some political parties. Common people loose trust on judiciary for this kind of Justices.

  Reply
  • January 16, 2018 at 2:59 pm
   Permalink

   Yes you’re 100000%true

   Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!