ఓల్డేజ్ హొం లొ కాలం గడుపుతున్న మాజి ఏలక్షన్ కమీషనర్ TN.శేషన్ గారు

Share the Post
#Bharatjago : మాజీ ఏలక్షన్ కమిషనర్ T.N. శేషన్ అంటే తెలియనివారుండరు. భారతదేశ ఏన్నికల చరిత్రలొ శేషన్ గారు తనదైన ముద్ర వేశారు. 1990-96 వరకు ఏలక్షన్ కమిషనర్ గా పనిచేసిన శేషన్ గారు, భారతదేశ ఏన్నికల స్వరూపాన్ని మార్చివేశారు. తీవ్రస్థాయిలొ ఒత్తిడిలు వచ్చినప్పటికీ, అనేక రాజకీయ పార్టీలూ బహిరంగంగా వ్యతిరేకించినప్పటికీ ఏన్నికలలొ సంస్కరణలు తీసుకురావడంలొ ఏక్కడా వెనక్కు తగ్గలేదు. తమిళనాడుకు చెందిన శేషన్ గారు, 1955 లొ IAS అధికారిగా భాద్యతలు స్వీకరించి, 1989 నాటికి కేబినెట్ సెక్రటరీ స్థాయికి ఏదిగారు.
 
ఏన్నొ గొప్ప పదవులు చేపట్టిన శేషన్, అతని సతీమణి జయలక్షి గారు తమకు పిల్లలు లేకపొవడంతొ, తమను చూసే వారు లేక సొంత ఇంటిని వదిలేసి చెన్నై లొని గురుకులం వృద్ధాశ్రమంలొ కాలం వెళ్ళదీస్తున్నారు. శేషన్ దంపతులిద్దరికీ అరొగ్యం సరిగా ఉండకపొవడంతొ తప్పనిసరి పరిస్తితులలొ వృద్ధాశ్రమంలొ జీవితం గడుపుతుండటం భాధాకరం. తన కొచ్చే పెన్షన్ లొ తమ దంపతులిద్దరి ఆరొగ్య, జీవన ఖర్చులు పొను, మిగిలిన డబ్బులను శేషన్ గారు వృద్ధాశ్రమంలొని ఇతర రొగులకు ఖర్చు పెడుతుండటం విశేషం.
.
శేషన్ గారు, పుట్టపత్తి సాయిబాబా కు గొప్ప శుష్యడు మరియు భక్తుడు. పుట్తపత్తి సాయిబాబా చనిపొయిన తరువాత, ఆ బాధలొ శేషన్ గారి ఆరొగ్యం పాడైపొయింది.   గత మూడు సంవత్సరాల నుండి ఈ వృద్ధాశ్రమంలొ కాలం గడుపుతున్న శేషన్, మొన్న డిసెంబరులొ తన 85 వ పుట్టినరొజును ఈ వృద్ధాశ్రమంలొనే తన తొటి వారితొ కలిసి జరుపుకున్నారు.
.
 
అత్యంత నిజాయితీ పరునిగా పేరున్న శేషన్ గారు, తన జీవితంలొ ఒక్క రూపాయి లంచం తీసుకున్న దాఖలాలు లేవు. శేషన్ గారి అత్యున్నత ప్రభుత్వ సేవలకు గుర్తుగా 1996 లొ శేషన్ గారికి రామన్ మెగసెసె అవార్డు లభించింది.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!