ట్రంప్ తరువాత అమెరికా అధ్యక్ష రేసులొ భారత జాతీయురాలు “నిక్కి హలె” !!!

Share the Post
#Bharatjago : డొనాల్డ్ ట్రంప్ తరువాత అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున మన భారత జాతీయురాలైన నిక్కి హలె పొటీ చేయనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలొ అమెరికా తరపున ప్రధాన రాయబారిగా నిక్కి హలె, కీలక భాద్యతలు నిర్వహిస్తున్నారు. 45 సంవత్సరాల నిక్కీ హలె, ఇంతకు ముందు అమెరికాలొని దక్షిణ కరొలినా రాస్ట్రానికి 116 వ గవర్నర్ గా పనిచేసిన అనుభవం ఉంది.
.
 
నిజానికి 2012 లొనే అమెరికా ఉపాద్యక్షురాలు కావలసిన నిక్కి హలె, అయితే ఆ ఏన్నికలలొ రిపబ్లికన్ పార్టీ ఓడిపొవడంతొ ఆ అవకాశం కొల్పొయారు. కాగా ఐక్యరాజ్యసమితిలొ అమెరికన్ రాయబారిగా కీలక భాద్యతలు నిర్వహిస్తున్న నిక్కిహలె, డొనాల్డ్ ట్రంప్ మొండిగా తీసుకునే ప్రతి నిర్ణయాన్ని, లౌక్యంగా, సామరస్యంగా అన్ని దేశాలకు నచ్చ చెబుతూ ఐక్యరాజ్యసమితిలొ అందరి ప్రశంసలు పొందుతున్నారు. ముఖ్యంగా ప్రపంచంలొ ఉత్తర కొరియా ను ఏకాకిని చేసే విషయంలొ ప్రపంచ దేశాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడంలొ సఫలీకృతులైనారు. ఉత్తర కొరియా పై అమెరికా మిలటరీ ఫొర్స్ ను ఉపయోగించడానికి సిధంగా ఉందని చెబుతూ, అందుకు అన్ని దేశాల మద్దత్తు కూడగట్టడంలొ విజయం సాధించారు.
.
 
కాగా పొయిన సంవత్సరం ఐక్యరాజ్య సమితి సమావేశాలలొ నిక్కిహేలి, అమెరికా తరపున చేసిన అద్భుతమైన ప్రసంగం తరువాతి నుండి భవిష్యత్తులొ అమెరికా అధ్యక్షురాలిగా ఏన్నికయ్యే అవకాశం ఉందని, అందుకు ఆమె అర్హురాలన్న వార్తలు వెలుగులొకి వచ్చాయి. భవిష్యత్తులొ నిక్కిహలె ఖచ్చితంగా అమెరికా అధ్యక్షురాలవుతుందని ఐక్యరాజ్యసమితి Top Expert “రిచర్డ్ గొవన్” వ్యాఖ్యానించడం విశేషం.
.
 
కాగా భారతజాతీయురాలైన నిక్కి హెల్లీ కి మన భారతదేశం పై ప్రత్యేక అభిమానం ఉంది. భారత్ పట్ల తన అభిమానాన్ని అనేక సంధర్బాలలొ చాటుకున్నారు. పాకిస్థాన్ ను ఏకాకిని చేయడంలొ, అమెరికాను భారత్ కు అనుకూలంగా మార్చడంలొ నిక్కిహలె తనదైన పాత్రను పొషించారు. భారత్ ను ఐక్యరాజ్య సమితి సెక్యురిటీ కౌన్సిల్ లొ శాశ్వత సభ్య దేశంగా చేర్చడానికి తీవ్రంగా ప్రయత్నించారు. భారత ప్రధాని మొది గారు ఏప్పుడు అమెరికా పర్యటనకు వెళ్ళినా నిక్కి హెల్లీ గారు తప్పని సరిగా మోది గారిని కలుస్తూ, ఆయన  ఈవెంట్లలొ పాల్గొంటారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!