భారత ప్రధానికి మరొక ఆభరణం : అత్యంత గౌరవనీయమయిన ప్రపంచ నాయకులలొ మూడవ స్థానం సంపాదించిన మోది

Share the Post
భారత ప్రధాని నరేంద్రమోది కి ప్రపంచంలొ మరొక అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలొని అత్యంత గౌరవనీయమైన నాయకులలొ భారత ప్రధాని నరేంద్రమొది గారు మూడవ స్థానం సంపాదించడం విశేషం. స్విడ్జర్లాండ్ కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ “గాలప్ ఇంటర్నేషనల్” సంస్థ చేసిన సర్వేలొ అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జింపింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధాని థేరిస్స మే లను వెనక్కు నెట్టి భారత ప్రధాని నరేంద్ర మోది మూడవ స్థానం సంపాదించడం విశేషం.
 
కాగా గాలప్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 53,769 మందిని చేసిన ఈ సర్వేలొ మొదటి స్థానంలొ జర్మనీ చాన్సులర్ ఏజెలా మార్కెల్ మొదటి స్థానం సంపాదించగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మక్రొన్ రెండవ స్థానం సంపాదించగా, భారత ప్రధాని నరేంద్రమోది గారు మూడవ స్థానం సంపాదించారు. నాలుగవ స్థానంలొ థెరిస్సా మె, ఐదవ స్థానంలొ చైనా అధ్యక్షుడు క్సింపింగ్, ఆరవ స్థానంలొ వ్లాదిమిర్ పుతిన్ నిలవగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం పదకొండవ స్థానంలొ నిలిచారు.
 
అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా చేసిన ఈ సర్వేలొ అనూకులంగా మార్కులు వచ్చిన ఆరుగురు దేశాధినేతలలొ నరేంద్రమోది గారు ఒకరు కావడం విశేషం. ఈ సర్వేలొ మొది గారు అనుకూలంగా 30% మార్కులు సాధించగా, వ్యతిరేకంగా 22% మార్కులు సాధించారు. మొత్తంగా +8 మార్కులతొ భారత ప్రధాని ప్రపంచంలొ మూడవ స్థానం సంపాదించడం విశేషం.
.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!