భారత్ కారణంగానే పాకిస్థాన్ కు అమెరికా ఫండింగ్ ఆప్పింది — విరుచుకు పడుతున్న చైనీస్ మీడియా

Share the Post
#Bharatjago :  గజ్జికి లేని దురద జాలుంలొషన్ కు వచ్చింది అనే సామెత ఇక్కడ సరిగ్గా సరిపొతుంది. తీవ్రవాదం పై చర్యలు తీసుకొకపొవడంతొ పాకిస్థాన్ కు అమెరికా మొత్తంగా 1.9 బిలియన్ డాలర్ల సహాయం ఆపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలొ పాకిస్థాన్ కన్నా చైనా నే ఏక్కువగా బాధ పడుతుంది. ఈ విషయంలొ మొన్నటి వరకు ట్రంప్ ని విమర్శించిన చైనీస్ మీడియా,  ఇప్పుడు భారత్ పై విరుచుకుపడుతుంది.
 
అమెరికా,పాకిస్థాన్ కు సహాయాన్ని ఆపడం వెనుక అసలు కుట్రదారు భారత్ అని చైనీస్ మీడియా “గ్లొబల్ టైంస్” మరొసారి భారత్ పై విషం కక్కింది. ఈ మద్య కాలంలొ భారత్ పూర్తిగా స్వీయ ప్రయొజనాల కొసమే పాకులాడుతుందని, పూర్తి స్వార్దపూరితంగా మారిపొయిందని తన ఎడిటొరియల్ లొ భారత్ పై తన అక్కసు వెళ్ళగక్కింది. పొరుగు దేశాలతొ ఘర్షణ వాతావరణాన్ని విడనాడి, భారత్ తన పొరుగు దేశాలను గౌరవించడం నేర్చుకొవాలని సుద్దులు చెప్పింది. భారత్ ప్రతి విషయాన్ని పాకిస్థాన్ తొ ముడి వేయడం వలననే అమెరికా, పాకిస్థాన్ కు సహాయాన్ని పూర్తిగా ఆపేసిందని తన ఎడిటొరియల్ లొ పేర్కొంది. అంతేకాకుండా తన మిత్రదేశం పాకిస్థాన్ కు చైనా చెప్పుకొతగ్గ ఆర్ధిక సాయం, ఆర్ధిక వనరులను అందించాలని కామెడి చేసింది (చైనా రూపాయికి పది రూపాయల లాభం లేకుండా పైసా కూడా విదిల్చదు)
 
అయితే చైనా ఏడుపు వెనుక ఉన్న అసలు కారణం వేరు. ఇనాళ్ళు అమెరికా అప్పనంగా సహాయం చేస్తుంటే ఆ డబ్బును #చైనా_పాకిస్థాన్ ఏకనమిక్ కారిడార్ లొ పెట్టుబడులు పెట్టించి ఏంజాయ్ చేసిన చైనాకు, ఇప్పుడు  అమెరికా సహాయన్ని ఆపివేయడంతొ ఏం చేయలొ పాలుపొవడం లేదు. పాకిస్థాన్ వద్ద ఫారెక్స్ నిల్వలు దాదాపుగా అడుగంటాయి. దీనితొ  పాకిస్థాన్ ఆర్ధిక మాన్యంలొకి కూరుకుపొతుంది.  ఇప్పుడు పాకిస్థాన్ పెట్టుబడులతొ పాటు పాకిస్థాన్ ఆర్ధిక వ్యవస్థ ను కూడా చైనానే మొయాల్సివచ్చే  పరిస్తితి ఏదురైంది. దీనికి తొడు ఏ అంతర్జాతీయ బ్యాంకు పాకిస్థాన్ కు ఋణాలివ్వడం లేదు. ఇంతచేసి పెట్టుబడులు పెట్టినా, కారిడార్ పై ఏప్పుడు ఏ తీవ్రవాద దాడి జరుగుతుందొ తెలియని పరిస్తితుల మద్య చైనా తన ఉక్రొషాన్ని అటు అమెరికా మీద, ఇటు భారత్ మీద వెళ్ళగక్కుతుంది.
.

One thought on “భారత్ కారణంగానే పాకిస్థాన్ కు అమెరికా ఫండింగ్ ఆప్పింది — విరుచుకు పడుతున్న చైనీస్ మీడియా

  • January 11, 2018 at 10:33 am
    Permalink

    credit goes to team modi .

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!