లచిత్ బర్ఫుకన్ : మొగలులకు ప్రాణ భయం రుచి చూపించి, ఊచకోత కోసిన భారతీయ యుధ వీరుడు

Share the Post
#Bharatjago :   లచిత్ బర్ఫుకన్, మొగలులకు ప్రాణ భయం అంటే ఏమిటొ రుచి చూపించి, ఊచకోత కోసిన భారతీయ యుధ వీరుడు. మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ, రాజా ఛత్రసాల్ ల సమకాలికుడు. 1671లో సరాయ్ ఘాట్ యుద్ధంలో అసంఖ్యాక మొఘలు సేనను అప్రతిహంగా ఎదుర్కుని వారిని అహోం రాజ్యం నుండి తరిమికొట్టిన వీరుడు.
 
లచిత్ బర్ఫుకన్ నేడు అస్సాంగా పిలవబడుతున్న ఒకనాటి అహోం రాజ్యంలో 1622 వ సంవత్సరంలొ  జన్మించాడు. చిన్ననాటి నుండి యుద్ధవిద్యలలో, భారతీయ సంప్రదాయ శాస్త్రాలలో లచిత్ బర్ఫుకన్  తర్ఫీదు పొందాడు.  ప్రతిభను గుర్తించి రాజా “చక్రధ్వజ సింహ”, లచిత్ బర్ఫుకన్ ను తన సర్వ సైన్యాధిపతిగా నియమించాడు.
 
మొహమ్మద్ ఘోరి కాలం నాటి నుండి ముస్లిం రాజులు అహోం రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసారు. భారతదేశాన్నంతా (మరాఠా రాజ్యాన్ని మినహా )ఆక్రమించిన మొఘలులు, అహోం రాజ్యాన్ని ఆక్రమించడానికి మొఘలుల సేనలు 1671లో బ్రహ్మపుత్ర నది తీరంలో సరాయిఘాట్ వద్ద మోహరించాయి. లచిత్ గొరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరినవాడు. అహోం రాజ్య భౌగోళిక, నైసర్గిక విశేషాలు బాగా తెలిసినవాడు. అహోం రాజ్య సంఖ్యాబలం మొఘలుల సేనతో పోలిస్తే చాలా తక్కువైనప్పటికీ నదీ జలాల మీద యుద్ధ తంత్రాన్ని నడిపి మొఘలుల సేనలను ఉచకోతకోసాడు.
 
యుద్ధం మధ్యలో మొగలులు, లచిత్ ను ప్రలోభపెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు. మాతృభూమి సేవకు అంకితమైన ఆ వీరుడు దేనికీ లొంగలేదు. యుద్ధంలో గాయపడటం వల్ల లచిత్ బర్ఫుకన్ ఆరోగ్యం దెబ్బతిన్నప్పటికీ, తన ఆరోగ్యాన్ని లెక్క చేయక నదీ మార్గం ద్వారా మొఘలు సేనలపై విరుచుకుపడి వారిని అహోం రాజ్యం నుండి తరిమికొట్టడమే కాకుండా, అంతకుముందు మొగలులు ఆక్రమించుకున్న గౌహతి సామ్రాజ్యాన్ని కూడా తిరిగి స్వాధీన పరచుకున్నారు. అయితే యుధంలొ తీవ్రంగా గాయపడిన లచిత్ బర్ఫుకన్, అదే సంవత్సరం చివరిలొ పరమపదించారు.
తద్వారా సరాయిఘాట్ యుద్ధము మొఘలులు ఓడిపోయి, పారిపొయిన అతి కొద్ది యుద్ధాలలో ఒకటిగా నిలిచిపోయింది
.

One thought on “లచిత్ బర్ఫుకన్ : మొగలులకు ప్రాణ భయం రుచి చూపించి, ఊచకోత కోసిన భారతీయ యుధ వీరుడు

  • January 9, 2018 at 11:41 am
    Permalink

    జయహో లచిత్ బర్ఫుకాన్
    భారత్ మాత కి జై

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!