డిల్లీ లొ “యువ హంకర్ ర్యాలి” నిర్వహించిన “జిగ్నేష్ మేవాని” కి భారీ ఏదురు దెబ్బ

Share the Post
#Bharatjago : డిల్లీ లొ జిగ్నేష్ మేవాని నిర్వహించిన యువ హంకర్ ర్యాలి కి  పెద్ద ఏదురు దెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వానికి, బిజెపి కి వ్యతిరేకంగా గుజరాత్ MLA “జిగ్నేష్ మేవాని” జరిపిన హంకర్ ర్యాలి జనాలు లేక బొసి పొయింది. తనకు మద్దత్తుగా వేల సంఖ్యలొ ప్రజలు హాజరవుతారని భావించిన జిగ్నేష్ మేవాని కి శృంగభంగమైంది.
.
 
వారం రొజుల క్రితం మహరాస్ట్రలొ ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించి, భీమా కొరిగావ్ హింసకు కారణమైన జిగ్నేష్ మేవాని పై పుణే పొలీసులు కేసు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పుణే పొలీసులు కేసు బుక్ చేసిన తరువాతి రొజే మహరాస్ట్రలొ మాయమై, డిల్లీలొ ప్రత్యక్షమైన జిగ్నేష్ మేవాని , తనకు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం కుట్ర చేస్తుందని, దీనిపై ప్రధాని నరేంద్రమోది సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ, డిల్లీలొ యువ హంకర్ ర్యాలి తలపెట్టాడు.
.
 
అయితే ఈ ర్యాలి కి డిల్లీ పొలీసులు అనుమతి నివ్వనప్పటికీ, ఈ ర్యాలి జరిపిన జిగ్నేష్ మేవాని కి ఊహించని ఏదురు దెబ్బ తగిలింది. జనాలు లేక సభ వెల వెల బొయింది. సభా ప్రాంగణంలొ ఏక్కువ శాతం ఖాలీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వేల మంది హాజరవుతారనుకున్న సభకు కేవలం 200 – 300 మంది మాత్రమే హాజరుకాగా, అందులొ 100 మంది దాకా పాత్రికేయులు ఉండగా, మరొక 100 మంది దాకా జిగ్నేష్ మేవాని అనుచరులే కావడం విశేషం.
.
 
ముందు ఈ ర్యాలీకి వేల సంఖ్యలొ యువకులు హాజరవుతారని భావించి, సెక్యురిటీగా పెద్ద ఏత్తున పొలీసులను మొహరించిన డిల్లీ పొలీసు అధికారులు, తరువాత జనం లేక సభ వెల వెల బొవడంతొ సెక్యురిటీని విరమించుకొవడం విశేషం.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!