మోదీ ఫొన్ వల్లనే ఆపరేషన్ రాహత్ విజయవంతమైంది – ఆపరేషన్ రాహత్ రహస్యాన్ని వెల్లడించిన సుష్మా స్వరాజ్

Share the Post

#Bharatjago : దాదాపు రెండు సంవత్సరాల తరువాత మొదటిసారి సుష్మాస్వరాజ్ గారు ఆపరేషన్ రాహత్ విజయవంతమవడానికి గల రహస్యాన్ని వెల్లడించారు. నరేంద్రమొది గారు సౌది అరేబియా రాజు కు ఫొన్ చేసి స్వయంగా మాట్లడటంతొ, సౌది అరేబియా  చేసిన సహాయం ద్వారా ఆపరేషన్ రాహత్ ను విజయవంతంగా పూర్తిచేయగలిగామని సుస్మాస్వరాజ్ వెల్లడించారు.

.

 

సింగపూర్ లొ ASEAN సదస్సులొ పాల్గొన్న సుష్మాస్వరాజ్ గారు ఈ సంధర్బంగా మాట్లాడుతూ “సౌది అరేబియా సంకీర్ణ దళాలతొ కలిసి 2015, మార్చి 26 న యెమెన్ పై దాడులు ప్రారంభించిందని, అయితే యెమెన్ లొ వేల మంది భారతీయులు ఉండటంతొ, వెంటనే స్పందించిన భారత ప్రధాని మొది గారు సౌది అరేబియా రాజు కు ఫొన్ చేసి, భారతీయులను రక్షించేందుకు ఒక వారం రొజులపాటు  బాంబు దాడులను కొంత సేపు ఆపాలని విజ్ణప్తి చేశారని సుష్మా గారు తెలియజేశారు.

సౌది అరేబియా రాజు మొది గారి విజ్ఞప్తిని గౌరవించి ” రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ బాంబు దాడులను నిలిపివేస్తామని” మొది గారికి హామి ఇచ్చారని తెలిపారు. వెంటనే నేను ఏమన్ అధికారులతొ ఆడెన్ పొర్టును, సనా ఏయిర్ పొర్టు ను తెరిపించమని రిక్వేస్టు చేయడంతొ  దానికి వారు అంగీకరించారని, దీనితొ ఏప్రియల్ 1 నుండి 11 రొజులపాటు జరిపిన Rescue Operation లొ మొత్తం 4800 మంది భారతీయులతొ పాటు, 41 దేశాలకు చెందిన 1972 మంది ఇతర దేశస్థులను రక్షించాగలిగామని వెల్లడించారు. ఈ ఆపరేషన్ ను ప్రస్తుత విదేశాంగసహాయ మంత్రి, మాజి ఆర్మి జనరల్ V.K.సింగ్ గారు దగ్గరుండి పర్యవేక్షించడంతొ ఆపరేషన్ రాహత్ పూరిస్థాయిలొ విజయవంతమైందని తెలియజేశారు.

కాగా “ఆపరేషన్ రాహత్” భారత బలగాలు విదేశాలలొ చేపట్టిన అతి పెద్ద రెస్క్యు ఆపరేషన్. ఈ ఆపరేషన్ లొ మొత్తంగా 43 మిలటరీ విమానాలు, హెలీకాప్టర్లు, నౌకలతొ పాటు గరుడ కమాండొస్ కూడా పాల్గొనడం విశేషం.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!