ఈశాన్య రాస్ట్రాలు మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేయనున్న బిజెపి … దీని వెనుక అసలు కారణమెంటొ తెలుసా ?

Share the Post
#Bharatjago :  నిజం చెప్పాలంటే కొంతకాలం క్రితం వరకు ఈశాన్య రాస్ట్రాలలొ బిజెపి అంటే చాలా మందికి తెలియదు. బిజెపి పార్టీకి అసలు అక్కడ లీడర్లు కాదు గదా, క్యాడర్ కూడా ఉండేది కాదు. కాని ఇప్పుడు పరిస్తితులు పూర్తిగా మారిపొయాయి. బిజెపి జాతీయ కార్యదర్శి “రాంమాధవ్” గారి చాణక్యంతొ ఇప్పటికే ఈశాన్య రాస్ట్రాలయిన అస్సాం, మణిపూర్, అరుణాచలప్రదేశ్ లలొ స్వంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన బిజెపి …. నాగాలాండ్, సిక్కిం లలొ NDA ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.
 
అదేవిధంగా ఈ సంవత్సరం మార్చిలో జరగనున్న మేఘాలయ, త్రిపురా, నాగాలాండ్‌ రాస్ట్రాల ఏన్నికలలొ ఖచ్చితంగా గెలిచి తీరాలన్న ఉదేశ్యంతొ ఇప్పటి నుండే ఇక్కడ ఏన్నికల ప్రచారం ప్రారంభించింది. అలాగే ఈ ఏడాది డిసెంబర్ లొ జరిగే మిజొరాం అంసెబ్లీ ఏన్నికలలొ కూడా విజయం సాధించడం ద్వారా ఏనిమిది ఈశాన్య రాస్ట్రాలను క్లీన్ స్వీప్ చేయాలని బిజెపి అడుగులు వేస్తుంది.
 
కేవలం 25 ఫార్లమెంట్ సీట్లు ఉన్న ఈశాన్య రాస్ట్రాలకు బిజెపి ఏందుకంత ప్రాముఖ్యతనిస్తుంది ….. ????
 
ఈ ఏనిమిది ఈసాన్య రాస్ట్రాలు 2,62,230 చదరపు కిలొమీటర్ల వైశాల్యంతొ, భారత దేశంలొ దాదాపు 8% భూభాగం కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఈ ఏనిమిది రాస్ట్రాలు టిబెట్ (చైనా), మయన్మార్, బంగ్లాదేశ్ లతొ 4,500 కిలొమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి. దీనితొ అటు చైనా, ఇటు పాకిస్థాన్ లు ఆయా దేశాల నుండి జాతి వ్యతిరేఖ శక్తులను భారత్ లొకి ప్రవేశపెట్టడమే కాకుండా, ఈ రాస్ట్రాలలొ ప్రత్యేక దేశం కొసం పొరాడుతున్న NSCN, NDFB, కబ్రీ టైగర్స్, MULTA లాంటి తీవ్రవాద సంస్థలకు పెద్ద ఏత్తున సహాయ సహకారాలు అందజేస్తున్నాయి. మొన్నటి వరకు పాలించిన ప్రభుత్వాలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకొక పొవడంతొ, వేర్పాటువాదుల సంఖ్య గణనీయంగా పెరిగిపొయింది.
 
దీనితొ 2014 లొ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గరి నుండి మోది గారు ఈశాన్య రాస్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడ అనేక కొత్త ప్రాజెక్టులను ప్రారంభించారు. అయితే అస్సాంలొ బిజెపి గెలిచిన తరువాత ఆ ప్రభావం మిగతా ఈశాన్య రాస్ట్రాలపై బాగా పడింది. అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సొనావాల్ ద్వారా మొది ప్రభుత్వం ఈశాన్య రాస్ట్రాలలొ వేర్పాటు వాదాన్ని తగ్గించి, జాతీయవాదాన్ని బలంగా చొప్పించ గలిగింది. ఈ ఫార్ములా విజయవంత మవడంతొ ఇక్కడి ఏనిమిది రాస్ట్రాలలొ బిజెపి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ద్వారా జాతీయను పెంచి, వేర్పాటువాద శక్తుల ఆట కట్టించవచ్చని బిజెపి భావిస్తుంది. దీనితొ ఏట్టి పరిస్తితులలొ ఈశాన్య రాస్ట్రాలు మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేసే దిశగా బిజెపి అడుగులు వేస్తుంది.
.

6 thoughts on “ఈశాన్య రాస్ట్రాలు మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేయనున్న బిజెపి … దీని వెనుక అసలు కారణమెంటొ తెలుసా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!