115 జిల్లాల్లో మోదీ మెగా ప్రాజెక్ట్
#BharatJago: ప్రధాని నరేంద్ర మోదీ గారు మరొక గొప్ప ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టు పేరు ” vision of New India “. దేశవ్యాప్తంగా కనీస వసతులు లేక అత్యంత ఘోరమైన పరిస్తితులలొ వెనుకబడి ఉన్న 115 జిల్లాలను 2022 నాటికి తప్పనిసరిగా అభివృద్ధి పధంలొకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. . ఇందులొ తెలంగాణకు చెందిన భూపాలపల్లి, అసిఫాబాద్, ఖమ్మం జిల్లాలు … ఆంద్రప్రదేశ్ కు చెందిన కడప, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలు ఉండటం విశేషం.
ఇప్పటికే దీనికి సంబందించిన పక్కా ప్రణాలిక తయారు చేసిన కేంద్ర ప్రభుత్వం, ఈ 115 జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క కేంద్ర ప్రభుత్వ అధికారి చొప్పున, మొత్తం 115 జిల్లాలకు 115 మంది కేంద్రప్రభుత్వ అధికారులను నియమించింది. ఇక నుండి “Prabhari Officers” గా పిలవబడే ఈ అధికారులు , ఆయా జిల్లాలను అభివృధి పధంలొ నడిపించడానికి కేంద్రప్రభుత్వం తయారు చేసిన ప్రణాలికలను ఆయా జిల్లాలలొ సమర్ధవంతంగా అమలు చేయడానికి, అభివృద్ధి కార్యక్రమాల విషయంలొ కేంద్ర_రాస్ట్ర ప్రభుత్వాలను సమన్వయ పరుస్తూ ముందుకు తీసుకుపొవడమే వీరి ముఖ్య ఏజెండా.
ఇందుకొసం ఆయా జిల్లాల అభివృద్ధికి సంబందించి మరిన్ని సలహాలు, సూచనల కొసం ఆ 115 జిల్లాలకు చెందిన కలెక్టర్లతొ, ఆ జిల్లాలకు కేంద్రప్రభుత్వం నియమించిన అధికారులందరితొ మొన్న శుక్రవారం నాడు భారత ప్రధాని నరేంద్రమోదీ గారు డిల్లీ లొని అంబేద్కర్ సెంటర్ లొ సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా మోదీ గారు మాట్లాడుతూ భారతీయులకు ఏది అసాధ్యం కాదని చెబుతూ, కేంద్రప్రభుత్వం ఆయా జిల్లాల అభివృద్ధి కొసం తయారు చేసిన ప్రణాలికను వివరించారు. ఎట్టి పరిస్తితులలో 2022 నాటికి 115 జిల్లాలలు అభివృద్ధి పధంలొకి నడిపించాలని, ఇందుకు కావలసిన అన్ని వనరులు అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఏప్రెల్ 14, అంబేద్కకర్ జయంతి రొజు నుండి ఆయా జిల్లాలలొ పర్యటిస్థానని తెలియజేశారు.
కాగా దేశవ్యాప్తంగా సామాజికంగా, ఆర్ధికంగా, వైద్య, విద్య, ఆరొగ్యం, తాగు నీరు, మరుగు దొడ్లు, విద్యుత్ సదుపాయాల కు సంబందించిన సూచికల ఆధారంగా ఈ వెనుకబడిన జిల్లాల లిస్టును తయారు చేశారు.
Congratulations prime minister of india