స్నేహలతా రెడ్డి – ఏమర్జెన్సీ కాలంలొ ఇందిరాగాంధీని ఎదిరించి వీరమరణం పొందిన తెలుగు ఆడపడుచు

Share the Post

స్నేహలతా రెడ్డి, ఏమర్జెన్సీ కాలంలొ ప్రజల కొసం పొరాటం చేసి ప్రాణాలర్పించిన మహాతల్లి. ఏమరెన్సీలొ అత్యంత దారుణంగా ఏడు నెలలు హింసిచబడ్డ వ్యక్తి కూడా స్నేహలతా రెడ్డి గారే. 1932 లొ ఆంద్రప్రదేశ్ లొ జన్మించిన స్నేహలతా రెడ్డి గారు సినీ నటి మరియు నిర్మాత. ఈమె తెలుగు సినిమా, తెలుగు నాటకరంగం అలాగే కన్నడ సినిమా, కన్నడ నాటకరంగ అభివృధి కొసం ఏంతొకృషి చేశారు. స్నేహలతా రెడ్డి గారు ఒక ఒక నాటకంలొ గాని లేదా ఒక సినిమాలొ గాని నటించారంటే ఖచ్చితంగా అదొక ఖళాఖండమై ఉండేది. గొప్ప సందేశాత్మకంగా ఉండేవి. నాటకరంగ అభివృధి కొసం 1960 లొ “మద్రాస్ ప్లేయర్స్” అనే సంస్థను ప్రారంభించారు. స్నేహలతా రెడ్డి గారు ఏప్పుడు డబ్బు కొసం కాకుండా కేవలం ప్రజలకు సందేశాన్నిచ్చే సినిమా లేదా నాటకాలలొ నటించేవారు.

పెళ్ళయిన తరువాత కర్ణాటకలొ స్థిరపడ్ద స్నేహలతా రెడ్డి గారు సామాజిక కార్యకర్త కావడంతొ భారతదేశ మాజి రక్షణ మంత్రి జార్గి ఫెర్నాండెస్ గారితొ పరిచయం ఏర్పడి అనేక సామాజిక కార్యక్రమాలలొ పాల్గొన్నారు. సరిగ్గా 1975 లొ ఇందిరాగాంధి, తన పదవిని కాపాడుకొవడం కొసం ఏమర్జెన్సీ విధించింది. సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన ఈ ఏమర్జెన్సీ కి వ్యతిరేకంగా స్నేహలతా రెడ్డి గారు జార్జి ఫెర్నాండెస్ తొ కలిసి పెద్ద ఏత్తున ఉద్యమించారు. దేశమంతా తిరుగుతూ ఏమర్జెన్సీ కి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య వంతులను చేయసాగారు.

ఈ విషయం ఆనాటి పాలకులకు కంటగింపుగా మారింది. అంతే డైనమేట్లతొ దేశంలొ అల్లకల్లొలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని దొంగ కేసులు బనాయించి జార్జి ఫెర్నాండెస్, స్నేహలతా రెడ్డి తొ సహా 24 మందిపై కేసులు బనాయించి జైళ్లలొ నిర్బందించారు. బెంగుళూరు జైళ్ళొ నిర్బందించిన స్నేహలతా రెడ్డి గారిని మహిళ అని కూడా చూడకుండా అత్యంత భయంకరంగా హింసించేవారు. ప్రతి రొజు స్నేహలతా రెడ్డి గారు హింసకు గురి చేయబడే వారు. ఆ సమయంలొ అదే జైల్లొ ఉన్న ఇతర ఖైదీలు రొజూ ఆమె ఏడుపులు వినేవారట. ఆవిధంగా దాదాపు ఏడు నెలల పాటు అత్యంత భయంకరమైన నరకాన్ని అనుభవించిన స్నేహలతా రెడ్డి గారు ఆరొగ్యం పూర్తిగా పాడైపొవడంతొ, పేరొల్ మీద జనవరి 15, 1977 లొ విడుదలైయ్యారు. విడుదలైన సరిగ్గా ఐదు రొజులకే అనగా జనవరి 20, 1977 న పరమపదించారు.

సమాజం కొసం, నాటక, చలనచిత్ర రంగ అభివృధి కొసం స్నేహలతా రెడ్డి గారు కృషి చేసినప్పటికీ ఆమె ఏవరొ దాదాపు ఏవరికీ తెలియక పొవడం దురదృష్టకరం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!