మోది వలన ప్రపంచంలొ పాకిస్థాన్ పరువుపొగొట్టుకుని ఏకాకైపొయింది — ముషారఫ్

Share the Post

చాలా రొజుల తరువాత పాకిస్థాన్ మాజి అధ్యక్షుడు జనరల్ ముషారఫ్ నొరు విప్పాడు. ARY News కు ఇచ్చిన ఇంటర్యూలొ ముషారఫ్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్రమోది వలన పాకిస్థాన్ పూర్తిగా పరువు పొగొట్టుకుని ప్రపంచంలొ ఓంటరిదైపొయిందని ఆవేదన వ్యక్తం చేశాడు . నరేంద్రమోది గొప్ప దౌత్య నీతిని ప్రదర్శించి పాకిస్థాన్ ను తలెత్తుకొలేకుండా చేశాడని తెలియజేశారు . పాకిస్థాన్ కు ప్రపంచంలొ ఏక్కడైనా గౌరవం ఉందా అని విలేకరులను ఏదురు ప్రశ్నించిన ముషారఫ్, దీనికంతటికీ కారణం మోది యేనని ఆగ్రహం వ్యక్తం చేశాడు

ఈ సంధర్బంగా ముషారఫ్ మాట్లాడుతూ, భారత్ ప్యూహాత్మకంగా అడుగులు వేసి పాకిస్థాన్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిందని, అదే సమయంలొ పాకిస్థాన్ విదేశాంగ విధానం లొపభుఇష్టంగా ఉందని పేర్కొన్నారు. మోది దౌత్యనీతి పాకిస్థాన్ కు శాపంగా మారిందని, భారత ప్రభుత్వం కులభూషన్ జాదవ్ ను గూఢచారిగా ఓప్పుకొకుండానే, పాకిస్థాన్ చేత లష్కరే తొయబాను  తీవ్రవాద సంస్థగా ప్రకటించేలా చేయగలిగిందని తెలియజేశారు. ఈ విషయంలొ పాకిస్థాన్ తప్పు చేసిందని పేర్కొన్నారు. లష్కరే తొయబా చాలా సంవత్సరాల నుండి కాశ్మీరులొ ఆజాది కొసం పనిచేస్తుందని, దాని తీవ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ పూర్తిస్థాయిలొ సహాయం చేస్తుందని మొదటిసారి ముషారఫ్ బహిరంగంగా ఓప్పుకొవడం విశేషం.

భారత్, అమెరికాతొ కలిసి లష్కరే తొయబా, జమాతుల్ దావ లను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించినప్పటికీ తనకు మాత్రం ఆ రెండు సంస్ఠలంటే చాలా ఇష్టమని, అంతర్జాతీయ తీవ్రవాది హఫీజ్ సయ్యద్ అంటే తనకు చాలా గౌరవమని, అలాగే వారికి కూడా తానంటే ఇష్టమని నిర్మొహమాటంగా తెలియజేశారు

.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!