కేరళలొ జిహాదీల భారీ కుట్రను భగ్నం చేసిన పొలీసులు

Share the Post
కేరళలొ అతి పెద్ద ఉగ్రవాద దాడిని పొలీసులు భగ్నం చేశారు. శుక్రవారం రొజున కుట్టిపురం రైల్వే బ్రిడ్జి క్రింద పెద్ద ఏత్తున ల్యాండ్ మైన్లను అమర్చి ట్రైన్ వచ్చే సమయానికి రైల్వే బ్రిడ్జిని పేల్చి వేద్దామనుకున్న జీహాదీ ల కుట్రను పొలీసులు భగ్నం చేసి వందలమంది ప్రాణాలను కాపాడ గలిగారు.
 
భరతపుర్జ నదిపై ఉన్న కుట్టిపురం రైల్వే బ్రిడ్జి కింద మెటాలిక్ కంటెయినర్ లొ దాచిపెట్టిన బాంబులను సకాలంలొ మల్లాపురం పొలీసులు కనుగొని, వాటిని నిర్వీర్యం చేయడంతొ అతి పెద్ద ప్రమాదం తప్పింది.. ఈ సంధర్బంగా మలాపురం డిస్ట్రిక్ పొలీస్ చీఫ్ మాట్లాడుతూ సాధారణంగా వీటిని మిలటరీ, బొర్డర్ సెక్యురిటి ఫొర్స్ లలొ మాత్రమే ఉపయొగిస్తుంటారని తెలియజేశారు. ప్రస్తుతం ఈ బాంబులను ఫొరెన్సిక్ నిపుణులు, బాబు స్క్వాడ్ తొ పరిశీలిస్తున్నామని, వీటికి సంబందించిన బ్యాచ్ నెంబర్లను, ఇతర వివరాలను కనుగొనే పనిలొ ఉన్నామని తెలియజేశారు.
 
కాగా కేరళ లొ మల్లాపురం జిల్లా అత్యంత సున్నితమైన ప్రాంతం. ఈ జిల్లా నుండి అత్యధికంగా యువకులు తీవ్రవాదం వైపు మళ్ళుతుండటంతొ గత రెండు సంవత్సరాలుగా ఈ జిల్లాలొ High Alert  ప్రకటించారు. కాగా ఈ కేసును నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చేపట్టే అవకాశం ఉంది.
.

One thought on “కేరళలొ జిహాదీల భారీ కుట్రను భగ్నం చేసిన పొలీసులు

  • January 6, 2018 at 1:32 am
    Permalink

    Dhanyavaad mallapuram police

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!