కులభూషన్ జాదవ్ కిడ్నాప్ కు సంబందించిన మిస్టరీని చేధించిన భారత ఏజెన్సీలు

Share the Post
మొత్తానికి భారత మాజి నేవి అధికారి కులభూషన్ జాదవ్ కిడ్నాప్ వెనుక ఉన్న మిష్టరీని భారత ఏజెన్సీలు చేధించాయి. కిడ్నాప్ చేసిన వ్యక్తిని, కిడ్నాపు చేసిన విధానాన్ని కూడా భారత ఏజెన్సీలు బహిర్గతం చేశాయి. పాకిస్థాన్ ఆర్మీతొ కలిసి పనిచేసే “జైష్-ఉల్-ఆద్” అనే ఉగ్రవాద సంస్థకు చెందిన “ముల్ల ఓమర్ ఇరాని” అనే తీవ్రవాది కులభూషన్ జాదవ్ ను కిడ్నాప్ చేసినట్టు భారత ఏజెన్సీలు గుర్తించాయి. (పై ఫొటొలొ ఉన్న వాడే జాదవ్ ను కిడ్నాప్ చేసిన “ముల్ల ఓమర్ ఇరాని” )
 
కులభూషన్ జాదవ్, చబహార్ పొర్టుకు సరిగ్గా 52 కిలొమీటర్ల దూరంలొ ఉన్న సర్బాజ్ పట్టణంలొ ఓంటరిగా ఉన్నప్పుడు “జైష్-ఉల్-ఆద్” కమాండర్ “ముల్ల ఓమర్ ఇరాని” జాదవ్ ను కిడ్నాప్ చేసి, తరువాత పాకిస్థాన్ ఆర్మీ కి అప్పగించినట్టు భారత ఏజెన్సీలు తెలియజేశాయి. ఈ “జైష్-ఉల్-ఆద్” పూర్తిగా పాకిస్థాన్ ఆర్మితొ కలిసి పనిచేసే తీవ్రవాద సంస్థ. పాకిస్థాన్ ఆర్మీ కొసం బెలూచిస్థాన్ ఉద్యమకారులను చంపుతూ, బెలూచిస్థాన్ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడమే వీరిపని. అంతేకాకుండా ఈ జైష్-ఉల్-ఆద్ తీవ్రవాద సంస్థ, హఫీజ్ సయ్యద్ కు చెందిన లష్కరే తొయబా, జమాతుల్ దావ తొ అత్యంత సన్నిహిత సంబందాలు కలిగిఉంది.  ఈ ఉగ్రవాద సంస్థకు పాకిస్థాన్ తరపున ఇరాన్ లొ కూడా అనేక దాడులు చేసిన చరిత్ర ఉంది.
 
ఈ తీవ్రవాద సంస్థకు ఇరాన్, బహ్రెయిన్ దేశాలలొని పాకిస్థాన్ రాయబార కార్యాలయాల నుండి, ఇస్లామాబాద్ నుండి నిధులు అందుతుంటాయి. సరిగ్గా కులభూషన్ జాదవ్, పాకిస్థాన్ అధికారులకు ధన్యవాదాలు చెబుతున్న విడియొను పాకిస్థాన్ విడుదల చేసిన కాసేపటికే కులభూషన్ జాదవ్ కిడ్నాపు కు సంబందించిన విషయాలు బయటికి రావడం విశేషం.
 
కులభూషన్ జాదవ్ కిడ్నాప్ కు సంబందించిన వాస్తవాలు బయటకు రావడంతొ, ఇక భారత ప్రభుత్వం దూకుడు పెంచనుంది
.

One thought on “కులభూషన్ జాదవ్ కిడ్నాప్ కు సంబందించిన మిస్టరీని చేధించిన భారత ఏజెన్సీలు

  • January 6, 2018 at 1:15 am
    Permalink

    పాకిస్థాన్ మర్యాదగా కులభూషణ్ జాదవ్ ను ఏక్కడి నుండి పట్టుకోచ్చారో అక్కడే వదలేయండి లేకుంటే రాచమర్యాదలతో భారత్ పంపించండి లేకుంటే మీకు మీరు పెంచి పోషిస్తున్న తీవ్రవాద గ్రూపులు కూడా నామారూపాలు లేకుండా చేసెస్తాం

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!