RSS వల్లనే భారతీయులు సురక్షితంగా ఉన్నారు – మాజి సుప్రీంకొర్టు జడ్జి KT.థామస్ సంచలన వ్యాఖ్యలు

Share the Post
సుప్రీం కొర్టు మాజీ న్యాయమూర్తి KT.ధామస్ గారు RSS గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఆర్మీ ల తరువాత భారతదేశాన్ని సురక్షితంగా ఉంచడంలొ రాస్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కీలక పాత్ర పొషించిందని కొనియాడారు. అంతేకాకుండా భారతదేశంలొ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఆర్మీలతొ పాటు రాస్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కూడా ఒక భాగమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
ఆదివారం నాడు కేరళ లొని కొట్టాయంలొ జరుగుతున్న RSS ట్రైనింగ్ క్యాంపు లొ పాల్గొన్న ధామస్ గారు మాట్లాడుతూ, అనేక సార్లు భారతదేశంపై, ఇక్కడి సమాజంపై దాడులు జరిగినప్పుడు RSS అండగా ఉండి దేశాన్ని, ప్రజలను రక్షించిందని పేర్కొన్నారు. నన్ను ఏవరైనా భారతీయులు సురక్షితంగా ఏలా ఉంటున్నారు అని అడిగితే “రాజ్యాంగం, ప్రాజాస్వామ్యం, ఆర్మీలతొ పాటు RSS వలన భారత్ Safe గా ఉందని నిరభ్యంతరంగా చెబుతానని తెలియజేశారు. అంతేకాకుండా ఏమర్జెన్సీ నుండి దేశానికి విముక్తి కలిగించింది RSS ఏనని తెలిపారు. హిందూయిజం అనేది మన సంసృతి అని, కాని దానిని కేవలం బిజెపి, ఆర్.యస్.యస్ కే ఆపాదించడం భాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఈ సంధర్బంగా ధామస్ గారు మాట్లాడుతూ సెక్యులరిజం అనే కాన్సెప్ట్, కేవలం మైనారిటీల రక్షణ కొసం మాత్రమే కాకుండా భారతీయులందరి రక్షణ కల్పించేలా ఉండాలని, కాని మైనారిటీల కొసం మాత్రమే కమీషన్లు ఏందుకు ఏర్పాటు చేశారని ఆయన ప్రశ్నించారు.
 
తాను క్రైస్థవుడనని, తరచుగా చర్చికి వెళతానని అయితే సాధారణ జీవితం గడుపుతూ, గొప్పగా ఆలొచించడం RSS నుండి నేర్చుకున్నానని, అందుకే తాను 1979 నుండే RSS అరాధకుడినయ్యానని తెలియజేయడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!