పూణే అల్లర్లతొ స్పష్టంగా బయటపడిన కాంగ్రెస్ మార్క్ కుల రాజకీయాలు.

Share the Post

బీమా కొరేగావ్ లో జరిగిన హింస ద్వారా దేశంలొ ఈ కుల రాజకీయాల వెనుక ఉన్న చీకటి శక్తులెవరనేది యావత్ భారతదేశానికి స్పష్టంగా అర్ధమైంది. 200 సంవత్సరాల క్రితం యుద్ధంలో మరణించిన దళితులను స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో, దళితులను రెచ్చగొట్టి దాడులకు ఉసిగొలిపారు. ఈ హింసకు ప్రధాన కారకులైన వ్యక్తులు జిగ్నేష్ మెహవానీ, ఉమర్ ఖాలిద్ లు. (జిగ్నేష్ మెహవానీ కాంగ్రెస్ చేత సృష్టించబడిన దళిత నాయకుడు, ఇతను కాంగ్రేస్ తరుపున గుజరాత్ లో ప్రచారం కూడ చేశాడు. స్వతంత్ర అభ్యర్దిగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాడు. దళిత ఓట్ల సమీకరణలో ఇతడు కాంగ్రేస్ కోసం కృషిచేశాడు).ఇక ఉమర్ ఖాలిద్ కు కాంగ్రెస్ కు ఉన్న సంబందం బహిరంగ రహస్యమే.

200 సంవత్సరాల క్రితం జరిగిన “భీమా కొరెగావ్ యుద్ధం” ద్వారా ఆనాడు బ్రిటీష్ వారు విజయవంతంగా భారతీయులను కులాల పరంగా విడగొడితే, ఇప్పుడు ఆ భాద్యతను కాంగ్రెస్ పార్టీ తన భుజాన వేసుకుంది. ఇప్పటి వరకు మత రాజకీయాలు సృష్టించిన కాంగ్రెస్ ,మొన్న గుజరాత్ ఎన్నికల నుండి కులరాజకీయాలకు తెరలేపింది ఈ కుల రాజకీయాలను తాజాగా మహారాష్ట్రకు విస్తరింప చేశారు.ఫడ్నవిస్ అధికారంలో ఉన్న మరాఠ రాజ్యం కరువు నుంచి పూర్తిగా కోలుకుంటున్న సమయంలొ, కాంగ్రేస్ కుల రాజకీయాలతో మహారాష్ట్ర ఒక్కసారిగా భగ్గుమన్నది.

కాంగ్రెస్,  హర్యాణలో జాట్స్ ని రెచ్చగొట్టి విఫలం అయ్యారు, గుజరాత్ లో పటెల్లను,రాజస్తాన్ లో క్షత్రియలను, కర్ణాటకలో లింగాయత్ లను ఇలా వివిద రాస్ట్రాలలొ వివిద కులాల మధ్య చిచ్చిపెడుతూ హిందువుల మధ్య విభజనకు తెరలేపుతుంది.ఒక పక్క అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు అంటూ వారిని రెచ్చగొడుతూ, మరొక పక్క దళితులపై అగ్రవర్ణాల ఆధిపత్యం అంటూ దళితులను రెచ్చగిడుతూ బ్రిటీష్ వారు అమలు చేసిన విభజించి, పాలించు సూత్రాన్ని ఖచ్చితంగా అమలు చేస్తుంది.

2014 లొ ఏన్నికలలొ, తరువాత జరిగిన కొన్ని రాస్ట్రాల ఏన్నికలలొ చావు దెబ్బ తిన్న కాంగ్రెస్, మరలా పూర్వవైభవం సాధించడానికి కుల రాజకీయాలనే ప్రధాన ఆయుధంగా చేసుకున్నట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. 2015 లొ గుజరాత్ లొ హార్ధిక్ పటేల్ ఆద్వర్యంలొ జరిగిన పాటీదార్ ఉద్యమం, 2016 లొ హర్యానాలొ లొ సడన్ గా ప్రారంభమై, తీవ్రరూపం దాల్చి 10 రొజుల పాటు జరిగిన జాట్ల ఉద్యమం, 2017 లొ యోగి ఆధిత్యనాద్ ముఖ్యమంత్రి అయిన తరువాత, ఆధిత్యనాధ్ గారిని దళిత వ్యతిరేఖిగా ప్రొజెక్టు చేయడం కొసం పక్కా ప్లాన్ తొ సృష్టించబడిన దళిత_ఠాకూర్ గొడవలు, నిన్న మహారాస్ట్రలొ జరిగిన అల్లర్ల వెనుక ఏవరున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే.

వీటన్నింటిలొ కామన్ గా ఉన్న నాలుగు విషయాలేమిటంటే, 1) ప్రతి రాస్ట్రంలొ జరిగిన కుల ఘర్షణల వెనుక కాంగ్రెస్ నాయకులకు ప్రత్యక్షంగా లేదా పరొక్షంగా సంబందం ఉంది. 2) జరిగిన హింసాత్మక సంఘటనలన్నీ తప్పుడు సమాచారం వలన జరిగినవే 3) జరిగిన ప్రతి ఉద్యమం లేదా హింస కేవలం బిజెపి ప్రభుత్వాలను దించడానికి మాత్రమే జరిగాయి..4) ఇప్పుడిప్పుడే ఐక్యత వస్తున్న హిందువులను కుల పరంగా చీల్చటం.

కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం, ఏదొక రకంగా మోదీని అధికారం నుంచి దింపడం. ఇందుకోసం ఏంచేయడానికైనా సిద్ధంగా ఉంది. గుజరాత్ ఎన్నికలకు ముందు మణిశంకర్ అయ్యర్ పాకిస్తానీ హైకమీషనర్ తొ రహస్యంగా జరిపిన చర్చలే ఇందుకు నిదర్శనం.

ఇదిలావుంటే 2016 లో Target Modi, Break India అనే బిల్లును పాకిస్తాన్ పార్లమెంట్ లో పాస్ చేశారు. ఈ విషయాన్ని News X బయట పెట్టింది. దీని ప్రకారం మోదీని ప్రజలు వ్యతిరేకించేలా, ద్వేషించేలా చేసి భారత్ లో అల్లర్లు సృష్టించడం ద్వారా మోదీ అడ్డు తొలగించుకొవాలన్నది వారి ప్రధాన లక్ష్యం.. ఈ పూణే అల్లర్లు కూడ దానిలో భాగమే అనిపిస్తుంది.

 

 

2 thoughts on “పూణే అల్లర్లతొ స్పష్టంగా బయటపడిన కాంగ్రెస్ మార్క్ కుల రాజకీయాలు.

  • January 4, 2018 at 10:38 am
    Permalink

    Anti Indian mewani kalid Rahul b grade gang

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!