Superb News : డిప్యూటి జాతీయ భద్రతా సలహాదారు గా “Terrorism Expert” నియామకం

Share the Post
నేషనల్ సెక్యురిటీ (దేశ భద్రత)  విషయంలొ ఏమాత్రం రాజీపడని మొది ప్రభుత్వం, ఇప్పుడు మరొక కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటి జాతీయ భద్రతా సలహాదారు గా  మాజీ RAW Chief  “రాజీందర్ ఖన్నా” ను నియమించి మరొకసారి సరయిన నిర్ణయం తీసుకుంది.
 
1978 బ్యాచ్ కు చెందిన రాజీందర్ ఖన్నా గారు నేరుగా “రిసెర్చి అండ్ ఏనాలసిస్ సర్వీస్” (RAS) ఆఫీసరుగా ఏంపికయ్యారు. నేరుగా RAS ఆఫీసర్ గా రిక్రూటయి, RAW Chief గా పనిచేసిన మొదటి వ్యక్తి రాజీందర్ ఖన్నా కావడం విశేషం.  పైకి సున్నితంగా కనిపించే రాజీందర్ ఖన్నా గారు కరడుగట్టిన జాతీయవాది (దేశ భక్తుడు) అంతేకాకుండా విధినిర్వహణలొ అత్యంత ఖటినంగా వ్యవహరిస్థారని పేరుంది.
 
రాజీందర్ ఖన్నా గారికి అద్భుతమైన Track record ఉంది. RAW ఏజెన్సీ లొ మొదటిసారి Counter Terrorism Unit ను ప్రారంబించి, దానిని విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్ళిన ఘనత ఖన్నా గారిదే. ముఖ్యంగా పాకిస్థాన్, తీవ్రవాదానికి సంబందించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అవపూసన పట్టిన ఖన్నా గారు అనేక Counter Terrorism Operations ను విజయవంతంగా నిర్వహించారు. అందుకే ఖన్నా గారిని Expert on Pakistan and terrorism అని పిలుస్థారు. అందుకే మొది గారు ఏరికొరి “రాజీష్ ఖన్నా” ను డిప్యూటి గా నియమించారు
 
ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారు (NSA) గా అజిత్ ధొవల్ పనిచేస్తుండగా, ఇప్పుడు డిప్యూటి జాతీయ భద్రతా సలహాదారు (DNSA) గా రాజీందర్ ఖన్నా నియమితులైనారు ….. NSA, DNSA ఇద్దరు Intelligence Agency Background ఉన్నవారు కావడం భారతదేశ చరిత్రలొ ఇదే మొదటిసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!