Big News : మదర్సాలపై మరొక సంచలన నిర్ణయం తీసుకున్న యోగి ఆధిత్యనాధ్

Share the Post
సంచలన నిర్ణయాలకు మారుపేరైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాధ్ గారు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మదర్సాలలొ NCERT సిలబస్ ను ప్రవేశపెట్టి విద్యా సంస్కరణలను తీసుకురావడంతొ పాటు, స్వాతంత్ర్య దినొత్సవం నాడు మదర్సాలలొ జాతీయ గీతాన్ని ఆలపించి, దానిని విడియొ తీసి ప్రభుత్వానికి చూపించడాన్ని తప్పనిసరి చేసిన యొగి ప్రభుత్వం ఇప్పుడు మరొక సంచలన నిర్ణయం తీసుకుంది.
 
ఇప్పటివరకు మదర్సాలలొ కొన్ని ముస్లిం పండగలకు అధికంగా ఇస్తున్న సెలవులను  నాలుగు రొజులకు తగ్గిస్తూ, అలాగే ఇతర మతాల పండగలకు కూడా మదర్సాలలొ సెలవులిచ్చేలా కొత్త వార్షిక కేలండర్ ను విడుదల చేశారు. సాధారణంగా మదర్సాలలొ ఇప్పటి వరకు ముస్లిం పండగలతొ పాటు కేవలం హొళి, అంబేత్కర్ జయంతి రొజున మాత్రమే సెలవలు ఇచ్చేవారు.
 
కాని ఇప్పుడు యొగి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మదర్సా వార్షిక కేలండర్ ప్రకారం ముస్లిం పండగలైన ఈదుల్ జుహా, మొహ్రం పండగలకు ఇచ్చే సెలవలను నాలుగు రొజులకు తగ్గించడంతొ పాటు, కొత్తగా మహావీర్ జయంతి, బుద్ధ పూర్ణిమ, రక్షా బంధన్, మహర్ణవమి, దీపావళి, దసరా, క్రిస్మస్ పండగలకు కూడా మదర్సాలలొ సెలవలు ప్రకటించారు. అంతేకాకుండా వీటిని తప్పనిసరిగా అమలు చేయాలని మదర్సా బొర్డు రిజిస్టార్ “రాహుల్ గుప్తా” తేల్చి చెప్పారు.
 
మదర్సా విద్యార్ధులకు కూడా ఇతర విధ్యార్ధుల వలె “Basic school education” ను అందించేందుకు కృషి చేస్తున్నామని, గొప్ప వ్యక్తుల జయంతి ని జరుపుకొవడం ద్వారా, మదర్సా విధ్యార్ధులు కూడా వారి గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుందని మదర్సా బొర్డు రిజిస్టార్ “రాహుల్ గుప్తా” తెలియజేశారు.
 
అయితే యోగి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మదర్సా పెద్దలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

One thought on “Big News : మదర్సాలపై మరొక సంచలన నిర్ణయం తీసుకున్న యోగి ఆధిత్యనాధ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!