తగ్గేదే లేదు : చైనా చుట్టూ ఉచ్చు బిగిస్తున్న భారత్

Share the Post

వజ్రాన్ని వజ్రంతొనే కోయాలి అనే సామెతను భారత్ ఇప్పుడు అక్షరాలా పాటిస్తుంది. గత కొన్ని దశాబ్ధాలుగా భారత్ ను Roundup చేయడానికి ప్రయత్నిస్తున్న చైనాను, ఇప్పుడు భారత్ అదే దారిలొ చైనాను Corner చేస్తుంది. . ఆసియా లొ చైనా ప్రాబల్యం తగ్గించడానికి, ఆసియా లొని చైనా వ్యతిరేక దేశాలను ఒకే గొడుగు కిందకు వచ్చేలా చేసి, చైనాను ఏకాకిని చేయడానికి వడివడిగా అడుగులు వేస్తున్న భారత్, ఇప్పుడు చైనాకు ఉత్తరాన , దాదాపు చైనాలొ చొచ్చుకుపొయి ఉన్న మంగొలియా పై దృష్టి కేంద్రీకరించింది.

ఈ ఆలొచనతొనే భారత ప్రధాని నరేంద్రమొది గారు 2015 లొ మంగొలియాలొ పర్యటించి, శైశవ దశలొ ఉన్న రెండు దేశాల మద్య ఉన్న సంబందాలను మరిత విస్త్రుతం చేశారు. గత దశాబ్ద కాలంగా చైనా, మంగొలియా ల మద్య ఉన్న విబేధాలు, 2015 లొ దలైలామా మంగొలియాలొ పర్యటించడంతొ రెండు దేశాల మద్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. నిజానికి మంగొలియా దాదాపుగా చైనాపైనే ఆధారపడి ఉంది. మంగొలియా మొత్తం ఏగుమతులలొ 90% ఏగుమతులను చైనాకే చేస్తుంటుంది. దీనిని అవకాశంగా తీసుకున్న చైనా, మంగొలియా దిగుమతులపై పెద్ద ఏత్తున అధిక చార్జీలు, పన్నులు వసూలు చేయడం ప్రారంభించింది. రవాణా సౌకర్యాలపై ఆంక్షలు విధించింది. దీనితొ మంగొలియా సహాయం కొసం భారత్ ను అర్ధించడంతొ, సరిగ్గా ఈ అవకాశం కొసమే ఏదురు చూస్తున్న మొది ప్రభుత్వం వెంటనే రంగంలొకి దూకింది.

Land Locked దేశమైన మంగొలియా ను  సాధ్యమైనంత వరకు చైనాపై ఆధారపడకుండా చేయడానికి రష్యా సహకారం తీసుకుంటున్న భారత్, ప్రధానంగా మంగొలియా, చైనా మీద ఆధారపడే పేట్రొల్, డీజిల్, గ్యాస్ సమస్యలను తీర్చడం కొసం ఈ సంవత్సరం మంగొలియాలొ అతిపెద్ద అయిల్ రిఫైనరీ ను నిర్మించనుంది. దీని నిర్మాణం కొసం 700 మిలియన్ డాలర్లు, ఆయిల్ పైప్ లైన్ల కొసం 264 మిలియన్ డాలర్ల ఋణాన్ని భారత్ మంజూరు చేసింది.

ఇది 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ ను  శుధి చేసే అతిపెద్ద రిఫైనరీ కావడంతొ, మంగొలియాకు శాశ్వతంగా ఆయిల్, గ్యాస్ సమస్య తీరడమే కాకుండా చైనామీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా పొతుంది. అంతేకాకుండా దీనిద్వారా మంగొలియా GDP 10% పెరనుండటం విశేషం. దీనితొ పాటుగా  చైనాతొ సంబందం లేకుండా,  వ్లాడివొస్టొక్ పొర్టు ద్వారా మంగొలియా నుండి సరుకులను దిగుమతి చేసుకొవాలని మొది ప్రభుత్వం భావిస్తుంది. దీనితొ పాటుగా మంగొలియాలొ మౌలిక వసతులు కల్పించడం ద్వారా, మంగొలియాలొ పెద్ద ఏత్తున Network పెంచుకునేందుకు భారత్ అడుగులు వేస్తుంది.  తద్వారా  చైనాకు Master Stroke ఇచ్చేలా భారత ప్రభుత్వం ప్యూహాలు రచిస్తుంది.

కాగా ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలొ మంగొలియా అధ్యక్షుడు  “ఖల్మాగీన్ భత్తుల్గ”  చేయనున్న భారత పర్యటనలొ ఇరు దేశాల మద్య కీలక  ఓప్పందాలు జరగనున్నాయి.

 

One thought on “తగ్గేదే లేదు : చైనా చుట్టూ ఉచ్చు బిగిస్తున్న భారత్

  • January 16, 2018 at 12:58 am
    Permalink

    Correct, ఓకప్పుడు మంగోలియన్లు మన దగ్గర దోచుకున్నది మనం తిరిగి తెచ్చుకోవాలి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!