Big Breaking News : ట్రంప్ దెబ్బకు దిగి వచ్చిన పాక్, తీవ్రవాద సంస్థలపై చర్యలు ప్రారంభం

Share the Post
మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ సత్తా చూపించాడు. నిన్న పాకిస్థాన్ ను టార్గెట్ చేస్తూ ట్రంప్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.  ట్రంప్ ట్వీట్ దెబ్బకు బెదిరిపొయిన పాకిస్థాన్,  ట్వీట్ చేసి 24 గంటలు గడవకముందే తీవ్రవాదం పై చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా ముంబాయి దాడుల మాస్టర్ మైండ్, అంతర్జాతీయ తీవ్రవాది అయిన హఫీజ్ సయ్యద్ పై ముందుగా చర్యలు ప్రారంభించింది.
 
తీవ్రవాద కార్యకలాపాల కొసం జమాత్ ఉల్ దావా, లష్కరే తొయబా, FIF ల తరపున పెద్ద ఏత్తున విరాళాలు సేకరిస్తున్న హఫీజ్ సయ్యద్ కు చెందిన అన్ని ఆర్గనైజేషన్స్ పై విరాళాలు సేకరించకుండా పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఒకవేళ ఏవరైనా దీనికి ఓప్పుకొకుండా, గీత దాటినట్లయితే భారీ ఏత్తున పెనాల్టి విధించనున్నట్టు పాకిస్థాన్ హెచ్చరించింది. అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి లిస్టులొ ఉన్న లష్కరే తొయబా, జామాతుల్ దావా లతొ పాటు నాలుగు ఉగ్రవాద సంస్థలపై పాకిస్థాన్ నిషేదం విధించడం విశేషం.
 
పాకిస్థాన్ లొ హఫీజ్ సయ్యద్ కు చెందిన సంస్థలు దాదాపు 50,000 మంది వాలెంటీర్లతొ, వందల మంది తీవ్రవాదులతొ భారీ Network ను కలిగి ఉన్నాయి. ఉగ్రవాద సంస్థలపై పాకిస్థాన్ ఈ స్థాయిలొ చర్యలు చేపట్టడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా పాకిస్థాన్ లొని హఫీజ్ సయ్యద్ కు చెందిన ఆర్గనైజేషన్స్ ను, ఆస్తులను పూర్తిగా స్వాధినం చేసుకొవడానికి కావలసిన యాక్షన్ ప్లాన్ కు సంబందించిన Secret Order ను పాకిస్థాన్ లొని అన్ని ఫ్రావిన్స్ (రాస్ట్రాలు) లకు పంపినట్టు రాయిటర్స్ మీడియా తెలియజేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!