Amazing News : సనాతన ధర్మాన్ని స్వీకరించిన అతి పెద్ద ముస్లిం దేశపు యువరాణి

Share the Post
బహుశా ఈ విషయాన్ని చాలా మంది జీర్ణించుకొలేకపొవచ్చు. ప్రపంచంలొ వేగంగా విస్థరిస్తున్న హిందూ ధర్మానికి ఇదొక చక్కటి నిదర్శనం. దాదాపు 23 కొట్ల ముస్లిం జనాభా కలిగి, ప్రపంచంలొనే అతిపెద్ద ఇస్లామిక్ దేశమైన ఇండొనేసియా (జావా) యువరాణి “కంజెంగ్ రాదెన్ ఆయు మహీంద్రాని” ఆగమ సాంప్రదాయ బద్దంగా హిందూ మతాన్ని స్వీకరించారు.
 
ఇండొనేసియాలొని బాలి నగరంలొ ఉన్న అత్యంత ప్రసిధి చెందిన “ఫుర లుహుర్ ఛతుర ఖంద ఫట్ శారి” ఆలయంలొ జరిగే హిందూ పవిత్ర కార్యక్రమమైన “సుధి వదాని” లొ పాల్గొని యువరాణి హిందుమతాన్ని స్వీకరించారు. ఇండొనేసియాలొ ఇతర మతస్తులు హిందూ మతం స్వీకరించే కార్యక్రమాన్నే “సుధి వదాని” అంటారు.  బాలి లొని ప్రముఖ హిందూ పుజారి అయిన ” భగవాన్ పెమయున్” ఆద్వర్యంలొ నారాయణ, గాయత్రి, వేదొచ్చారణల మద్య ఇండొనేసియా యువరాణి పూర్తి స్థాయి హిందువుగా మారారు.
 
ఈ సంధర్బంగా జావా యువరాణి “కంజెంగ్ రాదెన్ ఆయు మహీంద్రాని” మాట్లాడుతూ ఇండొనేసియా లొ పూర్వకాలం (మొదటి) నుండి ఉన్నది హిందూ మతమేనని, తరువాత అరబ్బు దేశస్తుల రాకతొ ఇస్లాం దేశంగా మార్చబడిందని తెలియజేశారు. తాను కొత్తగా హిందూ మతాన్ని స్వీకరించలేదని, తమ మాతృ ధర్మమైన హిందుమతాన్ని మరలా స్వీకరించినందుకు చాలా సంతొషంగా ఉందని తెలిపారు. తాను హిందూ ధర్మాన్ని స్వీకరిస్థానన్న విషయం చెప్పినప్పుడు తన సొదరునితొ సహా,కుటుంబ సభ్యులందరూ తనను ప్రొత్సహించారని, అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా బాలిలొ ఒక ఆశ్రమాన్ని నిర్మిస్థానని ప్రతిగ్ణ చేయడం విశేషం.

2 thoughts on “Amazing News : సనాతన ధర్మాన్ని స్వీకరించిన అతి పెద్ద ముస్లిం దేశపు యువరాణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!