ప్రతి భారతీయుడు తప్పనిసరిగా చదవాల్సిన వ్యాసం

Share the Post

నేను ఈ వ్యాసంలో ప్రధాన సేవకుడు మోదీజీ గురించి చెప్పాలనుకుంటున్నాను. దేశం కోసం ఆయన 18 గంటలు కష్టపడుతూ చివాట్లు తింటున్న ఏకైక ప్రధా ని మోదీ అనే చెప్పాలి. ఇప్పటిదాక ఏమి చేయని ప్రధానులను చూసాం. కాని ఈ దేశం కోసం అహర్నిశలు శ్రమించి తిట్టించుకుంటున్న ప్రధానిని మోదీ గారినే చూస్తున్నాం.

ఈ దేశం కోసం తను 2001 నుంచి ఇప్పటి వరకు ఒక్క రొజు కూడా సెలవు తీసుకోపోవడం ఆయన తప్పా!, ఈ దేశం కోసం తన వైవాహిక జీవితాన్ని వదులు కోవడం తప్పా, విదేశాలకు రాత్రి పూట ప్రయాణించి హోటల్ బిల్లులు ఆదా చేయటం ఆయన చేసిన తప్పా, అవినీతి రహిత పాలన చేయటం ఆయన చేసిన మరో తప్పా. ఇవి తప్పు అయితే ఆ తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తారు ఈ ప్రదాన సేవకుడు.

అదికారం తన లక్ష్యం కాదు, అభివృద్దే తన లక్ష్యం. ఈ దేశ ఆర్దిక పున:నిర్మాణమే లక్ష్యంగా నోట్లరద్దు, జీఎస్టీ వంటి కఠిన సంస్కరణలు చేపట్టారు.సాధారణంగా ఇలాంటి కఠిన సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వాలు చరిత్రలో మళ్ళీ అధికారంలోకి వచ్చిన ధాఖలాలు లేవు. ఆయన లక్ష్యం ఈ దేశం అభివృద్ది మాత్రమేనని అధికారం కాదని ఇలాంటి సంస్కరణల ద్వారా చెప్పకనే చెప్పారు. బినామి చట్టం, దివలా చట్టం, రియల్ ఎస్టేట్ చట్టాల ద్వారా అవినీతి పరులపై ఉక్కుపాదం మోపుతున్నారు.

2014 మే నెలకు ముందు ఈ దేశంలో ఇంకా 18,452 గ్రామాలకు విద్యుత్ లేదు.అందులో ఇప్పటి వరకు 15,983 గ్రామాలకు విద్యుత్తీకరణ చేశారు.

2014 నాటికి 10కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు లేవు. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం కట్టెల పొయ్యి మీద వంట వండటం వలన శ్వాశకోశ సంబందమైన రోగాలు వస్తున్నాయి అని ఒక రిపోర్ట్ లో తెలిపారు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోదీగారు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ను ప్రవేశపెట్టారు. 10 కోట్ల పేద కుంటుంబాలకు గ్యాస్ కనెక్షన్ల లక్ష్యంగా, మే 1 2016 ఉత్తర్ ప్రదేశ్ లో మొదలు పెట్టారు. మూడు సంవత్సరాలలో 5 కోట్ల కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 3.2 కోట్ల కనెక్షన్లు ఇచ్చారు.

ముద్ర యోజన పథకం ద్వారా చిన్న వ్యాపారులకు, సేవా రంగాలకు, వాణిజ్య రంగాలకు (శిశు విభాగం రూ.50,000 వరకు, కిశోర విభాగము రూ. 50, 000 వేల నుంచి రూ.5లక్షల వరకు, తరుణ్ విభాగము రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ) రుణాలు లభిస్తాయి. ఈ పధకం ద్వారా అత్యంధికంగా లబ్ది పొందింది దళిత మహిళలే కావడం విశేషం.

మరుగు దొడ్లు, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఇలా ఎన్నో పధకాలు తదుపరి పొందుపరుస్తాము.

 

పొందుపరిచిన సమాచారం: 1-2-2018 వరుకు లభించిన సమాచారం ప్రకారం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!