జాదవ్ తల్లి, భార్యలను అవమానించినందుకు పాకిస్థాన్ కు షాక్ ల మీద షాక్ లిస్తున్న భారత్

Share the Post
కులభూషన్ జాదవ్ తల్లి, భార్యలను బలవంతంగా మగళసూత్రం, గాజులు, బొట్టు తొ పాటు చివరికి చెప్పులకు కూడా వదలకుండా బలవంతంగా తీసుకుని, నిందితులను ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేసి, ఘొరంగా అవమానించినందుకు రగిలిపొతున్న భారత ప్రభుత్వం, దానికి తగ్గట్టే పాకిస్థాన్ కు షాక్ ల మీద షాక్ ల మీద షాక్ లిస్తుంది 
 
డిల్లీ లొని “హజ్రత్ నిజాముదీన్ దర్గా” లొ జరిగే #ఉరుసు ఉత్సవాలకు పాకిస్థానీ భక్తులను ఆహ్వానించడం దాదాపు 43 సంవత్సరాల నుండి సాంప్రదాయం. ఇరు దేశాల ప్రజల మద్య సత్సంబందాలు పెంపొందించడం కొసం అంటూ 1974 లొ ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ సాంప్రదాయానికి మోది ప్రభుత్వం తిలొదకాలిచ్చింది. ఇందుకొసం విసా కొసం దరఖాస్తు చేసిన 192 మంది పాకిస్థానీల దరఖాస్తులను నిర్ద్విద్వంగా తిరస్కరించిన భారత్, ఇప్పుడు మరొక పంచ్ ఇచ్చింది.
 
భారత్, పాకిస్థాన్ ల మద్య ఏట్టి పరిస్తితులలొ ద్వైపాక్షిక క్రికెట్ సీరీస్ జరిగే ప్రశ్నే లేదని భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ తేల్చి చెప్పారు. ఈ విషయంలొ ఏవరికైనా ఆశలుంటే వాటిని వదులు కొవాలని ఖరాఖండిగా చెప్పారు. ఇదేకాకుండా ఈ సంవత్సరం సెప్టెంబరు నెలలొ భారత్ లొ జరిగే 2018 ఏషియా కప్ టొర్నమెంట్ కు పాకిస్థాని క్రికెట్ టీం ను Ban చేయనునట్టు తెలుస్తుంది. ఇది పాకిస్థాన్ కు పెద్ద అవమానం, ఏదురు దెబ్బ కానుంది.
 
సరిగ్గా కులభూషన్ జాదవ్ తల్లి, భార్యలు పాకిస్థాన్ నుండి తిరిగి భారత్ వచ్చిన తరువాతి రొజు పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు అయిన “నాసిర్ ఖాన్” ను బ్యాంకాక్ లొ కలిసిన అజిత్ ధొవల్ గారు ఈ విషయం పై తీవ్ర స్థాయిలొ చీవాట్లు పెట్టి, తనదైన స్టైల్లొ గట్టి వార్నింగ్ ఇచ్చారుట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!