Unbelievable news : సంచలన నిర్ణయం తీసుకున్న ఉత్తరాఖండ్ మదర్సాలు

Share the Post
ఉత్తరాఖండ్ లొని “మదర్సా వెల్ఫేర్ సొసైటి” (MWS) సంచలన నిర్ణయం తీసుకుంది. మొత్తం 207 మదర్సాలను కలిగి ఉన్న ఈ సొసైటి, ఆయా మదర్సాల సంక్షేమం కొసం పనిచేస్తుంటుంది. ఇప్పుడీ “మదర్సా వెల్ఫేర్ సొసైటి”, ఇక నుండి మదర్సాలలొ సంసృత_భాష ను ప్రవేశపెట్టాలని ఊహించని గొప్ప నిర్ణయం తీసుకుంది.
.
 ఇందుకొసం మదర్సాలలొ సంసృత భాష ను ప్రవేశ పెట్టడానికి కావలసిన ఏర్పాట్లు, సౌకర్యాలు అందించడంలొ సహాయం చేయవలసిందిగా మదర్సా వెల్ఫేర్ సొసైటి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివెంద్ర రావత్ గారికి లేఖ వ్రాశారు. ఈ సంధర్బంగా “మదర్సా వెల్ఫేర్ సొసైటీ” చైర్మన్ “సిబ్తి నబి” మాట్లాడుతూ మదర్సాలలొ సంసృత భాషను పాఠ్యంశాలలొ చేర్చాలని ఈ సొసైటీలొని అన్ని మదర్సాలు కలిసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. ఇందుకొసం కావలసిన సంసృత టీచర్లు, సిలబస్ కొసం సహాయం అందించ వలసినదిగా ముఖ్యమంత్రికి లేఖ వ్రాసినట్టు “సిబ్తి నబి” తెలియజేశారు. సంసృత భాష రాకపొవడంతొ, ఇంతవరకు ఆయుర్వేద విద్య ముస్లిం విధ్యార్ధులకు అందుబాటులొ లేదని, ఇక నుండి అటువంటి ఇబ్బందులు లేకుండా చూస్థామని ఆయన పేర్కొన్నారు.
 
కాగా ఉత్తరాఖండ్ లొ ఉన్న మదర్సా వెల్ఫేర్ సొసైటి లొ మొత్తం 207 మదర్సాలతొ, 25,000 మంది విధ్యార్ధులతొ పరిపుష్టంగా ఉంది. త్వరలొ ఈ విషయం పై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర రావత్ (బిజెపి) నిర్ణయం తీసుకొనున్నట్టు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!