రియల్ బాహుబలి : ప్రాణాలకు తెగించి అనేక మంది ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ “సుదర్శన్ షిండే”

Share the Post
మొన్న శనివారం ముంబాయి లొని కమలా మిల్స్ రెస్టారెంట్లలొ (పబ్స్) భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులొ దాదాపు 15 మంది చనిపొగా, పదుల సంఖ్యలొ ప్రజలు తీవ్ర గాయాల పాలయ్యారు. నిజానికి ఈ దుర్ఘటనలొ చనిపొవాల్సిన మరొక ఏనిమిది మందిని సుదర్శన్ షిండే అనే కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి కాపాడాడు.
 
ఈ సంఘటన జరిగిన వెంటనే Fire Department కన్నా ముందుగా అక్కడి లొకల పొలీస్ స్టేషన్ అయిన #వర్లీ పొలీసు స్టేషన్ నుండి పొలీసులు ముందుగా ఈ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే పెద్ద ఏత్తున మంటలు చెలరేగి కాలిపొతున్న కమలా మిల్స్ లొపలి నుండి ఒక వ్యక్తి దగ్గుతున్న శబ్ధం విన్న కానిస్టేబుల్ సుదర్శన్ షిండే లొపల ఇంకా బాధితులున్నారని తెలుసుకున్నారు.
 
అంతే సుదర్సన్ షిండే మరొక్క క్షణం ఆలొచించకుండా ఆ మంటలలొనే దూసుకు పొయి దాదాపు ఏడు అంతస్తుల పై నున్న భాధితులను ఒక్కొక్కరిని భుజాన వేసుకుని కిందకు రాసాగాడు. ఒక పక్క పెద్ద ఏత్తున మంటలు వ్యాపిస్తున్నా, సిలెండర్లు ఒక్కొక్కటిగా పేలిపొతున్నా, ఆల్కహాల్ వలన మంటలు పెద్ద ఏత్తున విస్థరిస్తున్నా లెక్క చేయకుండ అదే విధంగా ఏడు అంతస్తుల మీద నుండి ఏనిమిది మందిని  కానిస్టేబుల్ “సుదర్శన్ షిండే”  రక్షించడం విశేషం.
 
ఈ విధంగా సుదర్సన్ షిండే, తన విధిని నిర్వర్తిస్తున్న క్రమంలొ ఒక అమ్మాయిని తీసుకుని కిందకు వస్తుండగా హేమంత్ పడాల్కర్ అనే జర్నలిస్టు ఈ పొటొ తీయడంతొ సుదర్శన్ షిండే చేసిన సాహసం గురించి బయటి ప్రపంచానికి తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!