నూతన సంవత్సరంలొ పాకిస్థాన్ కు సరసమైన గిఫ్టు ఇచ్చిన “డొనాల్డ్ ట్రంప్”

Share the Post
నూతన సంవత్సరంలొ పాకిస్థాన్ కు డొనాల్డ్ ట్రంప్ సరసమయిన, సరయిన బహుమతి నిచ్చాడు. తీవ్రవాదం పై ఇప్పటి వరకు పాకిస్థాన్ చర్యలు ప్రారంభించకపొవడంతొ మూడు రొజుల క్రితం పాకిస్థాన్ కు ఇవ్వవలసిన 255 మిలియన్ డాలర్ల సహాయాన్ని ఆపివేసిన అమెరికా అధ్యక్షుదు డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు కొత్త సంవత్సరంలొ పాకిస్థాన్ పై మరొకసారి విరుచుకు పడ్డారు.
 
ఈ సంధర్బంగా డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ లొ “గత 15 సంవత్సరాలుగా అమెరికా పిచ్చితనంగా పాకిస్థాన్ కు 33 బియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలొ దాదాపు 2,15,000 కొట్లు) కంటే ఏక్కువ సహాయం అందించిందని, ఇందుకు ప్రతిగా పాకిస్థాన్ నుండి అమెరికాకు ఏటువంటి సహాయం అందకపొగా, పాకిస్థాన్ నుండి అబద్దాలను, మొసాన్ని ప్రతిఫలంగా పొందామని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇప్పటి వరకు అమెరికా పాలకులు ఆలొచన లేకుండా పాకిస్థాన్ కు పెద్ద ఏత్తున సహాయం అందించారని, కాని పాకిస్థాన్ మాత్రం తీవ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, కేవలం ఆఫ్గనిస్థాన్ లొ కొతమంది తీవ్రవాదులను మట్టుబెట్టడానికి కొద్ది సాయం మాత్రమే చేసినట్టు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ లొ తెల్చి చెప్పారు.
కాగా ట్రంప్, అమెరికా అధ్యక్ష భాద్యతలు స్వీకరించిన దగ్గర నుండి తీవ్రవాదంపై, పాకిస్థాన్ పై ఖటిన వైఖరి అవలంబిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా 10 రొజుల క్రితం విడుదల చేసిన కొత్త నేషనల్ స్ట్రాటజి లొ కూడా పాకిస్థాన్, తన దేశంలొని తీవ్రవాదంపై ఖటిన చర్యలు చేపట్టాలని లేదంటే పాకిస్థాన్ ను ఏవరూ కాపాడలేరని తీవ్రస్థాయిలొ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!