Good News to India : అమెరికాకు “రెడ్ హ్యండెడ్” గా దొరికిపొయిన చైనా

Share the Post

ఏప్పుడూ రెండు నాలుకల ధొరణి ప్రదర్శించే చైనా నిజస్వరూపం బయట పడింది. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపొయి ప్రపంచం ముందు తలదించుకొవాల్సి వచ్చింది. ఇంతకాలం వరుస క్షిపణి ప్రయోగాలు చేస్తూ ప్రపంచదేశాలను రెచ్చగొడుతున్న ఉత్తరకొరియా తొ చర్చలు జరుపుతున్నట్టు నటిస్తూ వస్తున్న చైనా, ఇప్పుడు అసలు ఉత్తర కొరియా వెనుక ఉన్నదే చైనా అని అర్ధమవుతుంది.

ఖండాంతర్గత క్షిపణి ప్రయొగాలు చేస్తున్న ఉత్తరకొరియా పై చమురు దిగుమతి చేసుకొకుండా 2016 లొ ఐక్యరాజ్యసమితి ఖటినమైన ఆంక్షలు విధించింది. అయితే ఈ ఆంక్షలను బేఖాతరు చేస్తూ చైనా, ఇప్పటి వరకు 30సార్లు సముద్ర మార్గం ద్వారా ఉత్తరకొరియాకు చమురు సరఫరా చేసినట్టు అమెరికన్ శాటిలైట్లు గుర్తించాయి. అమెరికన్ మీడియాలొ కూడా ఈ వార్తలు రావడం విశేషం. (ఇంతకు ముందు ఉత్తరకొరియా ప్రయొగించిన ఒక మిసైల్ విషయంలొనే అమెరికాకు చైనా పై అనుమానాలు కలిగాయి)

దీనితొ నేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలొకి దిగి చైనా పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. చైనా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపొయిందని, చైనా ఇటువంటి దౌర్భాగ్యపు పని చేస్తుందనుకొలేదని దుయ్యబట్టారు. చైనా వలన ఉత్తరకొరియా సమస్య పరిస్కారం కాదని ఘాటైన వ్యాక్యలు చేశాడు. అయితే తమకేమి తెలియదని, ఐక్యరాజ్యసమితి ఆంక్షలను ఖచ్చితంగా పాటిస్తున్నామని నమ్మబలికిన చైనా పై మరొక దెబ్బ పడింది. అక్టొబరులొ దక్షిణ చైనా పట్టణం గువాంజౌ నుండి ఉత్తరకొరియాకు చమురు సరఫరా చేస్తున్న నౌకను తాము సీజ్ చేసినట్టు దక్షిణ కొరియా ప్రకటించడంతొ చైనా మరింత ఇబందులలొ పడింది.

మొత్తంగా ఇరుక్కుపొయిన చైనా  ఖచ్చితంగా దీనికి తగ్గ మూల్యం చెల్లించుకొక తప్పదు.

One thought on “Good News to India : అమెరికాకు “రెడ్ హ్యండెడ్” గా దొరికిపొయిన చైనా

  • December 30, 2017 at 6:19 am
    Permalink

    పాకిస్తాన్ వాళ్లకు కావలసినది వాడిన చెప్పులే కానీ కొత్తవి కాదు. దయచేసిమీ పాత చెప్పులు మాత్రమే పంపండి.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!