బిజెపి నేత స్పూర్తితొ “చెప్పుల” తొ పాకిస్థాన్ దుమ్ము దులుపుతున్న భారతీయులు

Share the Post
మానవతా దృక్పదంతొ అంటూ నీతి వాక్యాలు చెప్పిన పాకిస్థాన్, కులభూషన్ జాదవ్ తల్లి, భార్యలను తీవ్రంగా అవమానించిన సంగతి తెలిసిందే. చివరకు కులభూషన్ జాదవ్ సతీమణి చేతన జాదవ్ గారి చెప్పులు కూడా తీసుకున్న పాకిస్థాన్, ఆమె తిరిగి భారత్ వచ్చేటపుడు కనీసం తిరిగి ఇవ్వలేదు.
 
ఈ సంఘటనతొ రగిలి పొయిన డిల్లి బిజెపి అధికార ప్రతినిధి “తాజీందర్ సింగ్ భాగా” పాకిస్థాన్ కు సరయిన రీతిలొ బుధి చెప్పాడు. Online లొ చెప్పులను కొనుగొలు చేసి, వాటిని   పాకిస్థాన్ హైకమీషనర్ కు పంపించారు. అంతేకాకుండా ఈ విషయం గురించి సొషల్ మీడియాలొ పొస్టు చేస్తూ “పాకిస్థాన్‌ మన చెప్పులు కోరుకుంటోంది. వారికి చెప్పులు ఇద్దాం. నేను చెప్పులు కొనుగోలు చేసి పాక్‌ హైకమిషన్‌కు పంపాను. జాతీయవాదులంతా పాకిస్థాన్‌కు చెప్పులు పంపండి” అంటూ “Juta Bhejo Pakistan” పేరుతొ సొషల్ మీడియాలొ ప్రచారం ప్రారంభించారు.
 
ఈ ప్రచారానికి జాతీయవాదుల నుండి విపరీతంగా స్పందన వచ్చింది. ఈ ప్రచారం ప్రారంభించిన కొన్ని గంటలకే వందల మంది భారతీయులు Online లొ పాకిస్థాన్ కు చెప్పులు పంపారుట.  వచ్చేకొద్ది  ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది.  ఊహించని ఈ పరిణామానికి ఏలా స్పందించాలొ తెలియక పాక్ అధికారులు తలలు పట్టుకుంటున్నారుట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!