Breaking News : భారత్ లొ పర్యటించనున్న ఇజ్రాయిల్ ప్రధాని … పూర్తి వివరాలు

Share the Post
భారత్ కు గొప్ప మిత్రదేశమైన ఇజ్రాయిల్, ప్రధాని “బెంజిమెన్ నెతన్యుహ్” భారత్ లొ పర్యటించనున్నారు. జనవరిలొ భారత్ రానున్న బెంజిమెన్ నెతన్యుహ్ మొత్తంగా నాలుగు రొజుల పాటు భారత్ లొ పర్యటించనున్నారు. జనవరి 14 వ తేదీన నేరుగా అహమ్మదాబాద్ రానున్న బెంజిమెన్ నెతన్యుహ్ ను, భారత ప్రధాని మొది గారు స్వయంగా ఆహ్వానించనున్నారు. తరువాత బెంజిమెన్ నెతన్యుహ్ 15,16 తేదీలలొ డిల్లీలొ అనేక ఉన్నతస్థాయి సమావేశాలలొ పాల్గొని, భారత్ తొ కీలకమైన ఓప్పందాలు చేసుకొనున్నారు
 
17 వ తేదీన ముంబాయి చేరుకుని, 2008 దాడులలొ దెబ్బతిన్న యూదుల చాబాద్ హౌస్ ను సందర్శించడంతొ పాటు మరికొన్ని ముఖ్యమైన సమావేశాలలొ పాల్గొననున్న బెంజిమెన్ నెతన్యుహ్, 18 వ తేదీన తిరిగి ఇజ్రాయిల్ వెళ్ళనున్నారు.  బెంజిమెన్ నెతన్యుహ్ కు అమెరికా అధ్యక్షుని స్థాయిలొ అత్యున్నత భద్రతా  ఏర్పాట్లు చేయనున్నారు.
 
కాగా 1992 లొ రెండు దేశాల మద్య దౌత్య సంబందాలు ఏర్పడిన తరువాతి నుండి భారత్ లొ పర్యటించనున్న రెండవ ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యుహ్ కావడం విశేషం. 2003 లొ అప్పటి ఇజ్రాయిల్ ప్రధాని ఏరియల్ షరాన్ భారత్ లొ పర్యటించగా , దాదాపు 15 సంవత్సరాల తరువాత ఇజ్రాయిల్ ప్రధాని (బెంజిమెన్ నెతన్యుహ్) భారత్ లొ పర్యటించనున్నారు. . కాగా ఇద్దరు ఇజ్రాయిల్ ప్రధానులు బిజెపి ప్రభుత్వ హయాంలొనే భారత్ పర్యటిస్తుండటం విశేషం.
 
కాగా ఆరు నెలల క్రితం నరేంద్రమొది గారు ఇజ్రాయిల్ లొ పర్యటించి, ఇజ్రాయిల్ పర్యటించిన మొదటి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!