షయరా బాను, ట్రిపుల్ తలాక్ రద్దు వెనుక ఉన్న వీరవనిత

Share the Post
షయరాబాను, ట్రిపుల్ తలాక్ బిల్లు ఫార్లమెంట్ కు చేరడానికి కారణమైన మహిళ. ఉత్తరప్రదేశ్ కు చెందిన 35 ఏళ్ల షయరాబాను ట్రిపుల్ తలాక్, హలాల్ మీద సుప్రీంకొర్టు లొ న్యాయపొరాటం ప్రారంభించింది. ట్రిపుల్ తలాక్ అనేది ముస్లిం మహిళల హక్కులను ఏలా కాలరాస్తుందొ, దేశం మొత్తానికి తెలియజెప్పింది. ముస్లిం మహిళల ఆవేదనను వెలుగులొకి తెచ్చారు.
 
షయరాబాను కు 2001 లొ అలహాబాద్ కు చెందిన రియలెస్టేట్ డీలర్ “రిజ్వాన్ అహమ్మద్” తొ వివాహం జరిగింది. వివాహం జరిగిన దగ్గరి నుండి అదనపు కట్నం కొసం, కారు కొసం షయరాబాను, తన భర్త నుండి తీవ్ర వేధింపులకు గురయ్యింది. అనేకసార్లు భర్త చేతిలొ దెబ్బలు తింది. 2015 లొ అప్పటికే ఇద్దరి పిల్లల తల్లి అయిన షయరాబాను, తన భర్త చేతిలొ తీవ్రంగా గాయపడి, చికిత్స కొసం పుట్టింటికి వెళ్ళింది. వెళ్ళిన రెండు రొజులలొ తన భర్త Speed Post లొ త్రిపుల్ తలాక్ చెబుతూ విడాకులు ఇచ్చేశాడు.
 
దీనితొ తీవ్ర ఆవేదనకు గురయిన షయరాబాను, తనకు జరిగిన అన్యాయం మరే ముస్లిం మహిళకు జరగకూడదని రంగంలొకి దిగింది. సుప్రీంకొర్టులొ న్యాయపొరాటం మొదలు పెట్టింది. ధైర్యంగా ఆమె చేస్తున్న పొరాటం చూసి మెల్ల మెల్లగా మహిళా సంఘాలు, మీడియా, ప్రజా సంఘాలు, త్రిపుల్ తలాక్ ద్వారా నష్టపొయిన భాధితురాళ్ళు అందరూ తమంతట తాముగా షయరాబాను కు మదత్తు తెలుపుతూ ఆమె వెంట నడిచారు. దీని ద్వారా ట్రిపుల్ తలాక్ వలన నష్టపొతున్న ముస్లిం మహిళల భాధలు, ఆవేదనలు వెలుగులొకి వచ్చాయి. దేశ వ్యాప్తంగా పెద్ద ఏత్తున చర్చ జరిగింది. త్రిపుల్ తలాక్ చెప్పేవారికి జైలు శిక్షే సరయిన శిక్షని రిజ్వానా తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేసింది.
 
ఆమె చేసిన కృషి వలన అటు సుప్రీంకొర్టు, ఇటు బిజెపి ప్రభుత్వం త్రిపుల్ తలాక్ వలన మహిళలకు జరుగుతున్న నష్టాలు గుర్తించి, ఇప్పుడు దానిని రద్దు చేస్తూ చట్టం తెస్తున్నారు.

One thought on “షయరా బాను, ట్రిపుల్ తలాక్ రద్దు వెనుక ఉన్న వీరవనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!