Surprising : ఆస్ట్రేలియాలొ వేగంగా పెరుగుతున్న హిందువుల జనాభా

Share the Post
ఆస్ట్రేలియా లొ హిందుయిజం వేగంగా వృధిచెందుతుంది. 1991 నుండి 2016 వరకు ఆస్ట్రేలియాలొ హిందుయిజం   ఆరు రెట్లు పైగా పెరగడం విశేషం. 1991 లొ కేవలం 0.3% గా ఉన్న హిందువుల జనాభా, ప్రస్తుతం 1.9% చేరుకొవడం విశేషం. 2011 లొ 2,75,000 మంది ఉన్న హిందువుల జనాభా, 2016 నాటికి 4,40,300 కు చేరుకుంది. అంతేకాకుండా 14, అంతకన్నా తక్కువ వయస్సు ఉన్నవారు 34% ఉండగా, 34 ఏళ్ళు, అంతకన్నా తక్కువ వయసు ఉన్నవారు 66% గా ఉండి ఆస్ట్రేలియాలొ హిందూమతం ” Youthful Religion ” గా వృధి చెందింది.
.
 “ఆస్ట్రేలియా బ్యురొ ఆఫ్ స్టేటస్టిక్స్” విడుదల చేసిన లెక్కల ప్రకారం ఆస్ట్రేలియాలొ దేవుడిని నమ్మని వారి సంఖ్య విపరీతంగా పెరిగి 30.1% నికి చేరుకొగా వీరిలొ 29.6% అనగా 69,34,000 మంది తాము ఏ మతానికి చెందినవారముకామని చెప్పడం విశేషం. ఆశ్చ్యర్యకమైన విషయమేమిటంటే 2,45,70,000 జనాభా ఉన్న ఆస్ట్రేలియాలొ 18 – 34 ఏళ్ల మద్య వయస్సున్న వారు ఏక్కువమంది తాము ఏ మతానికి చెందిన వారిమి కామనిచెప్పడం విశేషం.
 
మిగతా విషయాలను పక్కన పెడితే ఆస్ట్రేలియాలొ హిందుయిజం ప్రతి సంవత్సరం వేగంగా అభివ్రుధి చెందుతుండటం చెప్పుకొతగ్గ పరిణామం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!