Big Breaking News : “ట్రిపుల్ తలాక్” బిల్లును ఆమొదించిన లొక్ సభ

Share the Post
ఏట్టకేలకు “ట్రిపుల్ తలాక్” బిల్లు కు లొక్ సభ ఆమొదం తెలిపింది. . ముస్లిం మహిళల వివాహ హక్కుల కొసం, రక్షణ కొసం తయారు చేయబడిన ఈ బిల్లు అనేక అవరొధాలు దాటుకుని మూజువాణి ఓటుతొ లొక్ సభ లొ ఆమోదించబడటం విశేషం. ఏన్నొ రొజుల నుండి Uniform Civil Code కొసం ప్రయత్నిస్తున్న బిజెపి కృషి ఫలించినట్టయ్యింది. ఈ సంధర్బంగా ఈ రొజును Historical Day గా బిజెపి అభివర్ణించింది. దీని ద్వారా ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మూడు సంవత్సరాల ఖటిన కారాగార శిక్ష విధించడమే కాకుండా, పెద్ద ఏత్తున జరిమానా విధించేలా ఈ బిల్లును తయారు చేయడం విశేషం
 
ముఖ్యంగా ఈ బిల్లు ద్వారా లక్షల మంది పేద, మద్యతరగతి ముస్లిం మహిళల జీవితాలకు రక్షణ కల్పించబడుతుంది. ప్రపంచంలొ అనేక దేశాలు ఇప్పటికే ట్రిపుల్ తలాక్ ను నిషేధించాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్, UAE, మలేసియా లతొ సహా 22 ముస్లిం దేశాలు ఇప్పటికే ఈ ట్రిపుల్ తలాక్ పై నిషేధం విధించాయి.
 
#కొసమెరుపు —  త్రిపుల్ తలాక్ పై నిన్నటి వరకు సరయిన అభిప్రాయం ప్రకటించని కాంగ్రెస్ పార్టీ, ఈరొజు మాట్లాడుతూ  ట్రిపుల్ తలాక్ ను రద్దు చేయడానికి కాంగ్రెస్ పార్టీ  శక్తివంచన లేకుండా, తీవ్రంగా కృషి చేసినట్టు ప్రకటించడం కొసమెరుపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!