2020 నాటికి భారత అమ్ముల పొదిలొ చేరనున్న 36 రాఫెల్ ఫైటర్లు, 32 సూపర్ సుఖొయ్ ఫైటర్లు

Share the Post
మొత్తానికి దాదాపు 22 సంవత్సరాల తరువాత శక్తివంతమైన ఫైటర్ జెట్లు భారత అమ్ముల పొదిలొ చేరనున్నాయి. 2019 లొ మొదటి బ్యాచ్ రాఫెల్ ఫైటర్లు భారత్ చేరుకొనున్నాయి. ఇందుకొసం రాఫెల్ ఫైటర్లకు సంబందించిన శిక్షణ నిచ్చేందుకు వచ్చే నెలలొ భారత ఫైలెట్లను, టెక్నీషియన్లను ఫ్రాన్స్ లొని మొంట్-డి-మర్సన్ ఏయిర్ బేస్ కు పంపనున్నారు.
 
మొత్తం 36 రాఫెల్ ఫైటర్ల కొసం భారత్, 8.7 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఓప్పందలొ ఫైటర్ల కన్నా మిగిన అంశాలకు ఏక్కువ ఏక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇందులొ ఒక్కొక్క ఫైటర్ ను 90 మిలియన్ డాలర్ల చొప్పున కొనుగొలు చేసిన భారత్, వీటితొ పాటు Game Changers అయిన మిథియోర్ మిసైల్స్, MICA (a weapons system) లతొ సహా, అంత్యంత కీలకమైన స్పేర్ పార్టులు, ఈ ఫైట్లకు సంబందిచి ఫైలెట్లకు, టెక్నీషియన్లకు శిక్షణ మాత్రమే కాకుండా 10 సంవత్సరాల పాటు ఉచితంగా సర్వీస్ అందించే విధంగా భారత ప్రభుత్వం, నేరుగా ప్రాన్స్ ప్రభుత్వంతొ Government-to-Government ఓప్పందం చేసుకుంది.
 
ఇకపొతే 1998 లొ కొనుగొలు చేసిన సుఖొయ్-30 ఫైటర్లను, అత్యున్నత సాంకేతిక పరిగ్ణానం ఉపయొగించి సూపర్ సుఖొయ్ లుగా అభివ్రుధి చేస్తున్నారు. సుపర్ సుఖొయ్ లు అనేవి చైనా ఉపయోగిస్తున్న సుఖొయ్-35 కన్నా అడ్వాన్సుడు ఫైటర్లు. అందుకే వీటిని “సుఖొయ్-35+” గా పిలుస్థారు. రష్యా కు చెందిన సుఖొయ్ కంపెనీ, భారత్ కు చెందిన హిందుస్థాన్ ఏరొనాటిక్స్ లు సమ్యుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టడం విశేషం. దీనిద్వారా అధునాతన టెక్నాలజి, హార్డ్ వేర్ భారత్ కు అందుబాటులొకి రానుంది.
 
మొత్తంగా 2020 నాటికి రాఫెల్ ఫైటర్లు, సూపర్ సుఖొయ్ లు భారత అమ్ముల పొదిలొ చేరనున్నాయి.

3 thoughts on “2020 నాటికి భారత అమ్ముల పొదిలొ చేరనున్న 36 రాఫెల్ ఫైటర్లు, 32 సూపర్ సుఖొయ్ ఫైటర్లు

 • December 28, 2017 at 3:04 am
  Permalink

  Excellent work from bjp government

  Reply
 • December 28, 2017 at 1:53 pm
  Permalink

  Some thing special

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!