మోది, యోగి ల ప్రేరణతొ భగవద్గీత పారాయణంలొ ప్రధమ స్థానం సాధించిన ముస్లిం బాలిక “అఫ్రీన్ రౌఫ్”

Share the Post

ఉత్తరప్రదేశ్ లొని లక్నొ కు చెందిన ముస్లిం బాలిక “అఫ్రీన్ రౌఫ్” భగవద్గీతా పారాయణంలొ మొదటిస్థానం సంపాదించి అందరినీ ఆశ్చ్యర్చపరచింది. లక్నొ ఏడ్యకేషన్ బొర్డు ఆధ్వర్యంలొ జరిగిన ఈ భగవద్గీత పొటీలలొ అఫ్రీన్ రౌఫ్, అద్భుత ప్రతిభను కనబరచి విజయం సాధించింది. ముస్లిం బాలిక అయిన అఫ్రీన్ రౌఫ్ కేవలం భగవద్గీత పఠనమే కాకుండా, అందులొ గొప్ప ప్రావీణ్యం సంపాదించడం విశేషం.

ఈ సంధర్బంగా అఫ్రీన్ రౌ మాట్లాడుతూ, తాను సాధించిన ఈ ఘనతకు భారత ప్రధాని నరేంద్రమొది, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యొగి ఆధిత్యనాధ్ లే కారణమని పేర్కొంది. తరచుగా మొది, యొగి గార్లు పద్యాలు వలించడం విని, ప్రేరణ పొంది, తాను భగవద్గీతవైపు ఆకర్షితురాలయ్యానని తెలిపింది. భగవద్గీత చదవడానికి మతంతొ సంబందం లేదని, ఏవరైనా చదవచ్చని, తన తల్లి కూడా ఈ విషయంలొ తనతొ ఏకీభవించిందని పేర్కొంది. బాలురకు బాలికలు ఏ విషయంలొనూ తీసిపొరని, బాలికలకు కూడా బాలురతొ సమానంగా చదువుకునే అవకాశం కల్పించాలని తెలియజేసింది.

ఈ అవార్డు సాధించిన తనను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యొగి ఆధిత్యనాద్ గుర్తించాలని అభ్యర్ధించింది. తప్పకుండా యోగి ఆధిత్యనాధ్ గారు తనకు గుర్తిస్థారన్న నమ్మకముందని తెలియజేసింది.  కాగా   త్వరలొ యోగి ఆధిత్యనాధ్ గారు అఫ్రీన్ రౌఫ్ ను కలిసి,  ప్రత్యేక బహుమతి అందజేయనున్నట్టు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!