చొటా రాజన్ ను చంపేందుకు దావూద్ ఇబ్రహీం కుట్ర – పసిగట్టిన ఇంటెలిజెన్స్

Share the Post
చొటా రాజన్ ను తీహార్ జైల్లొ చంపేందుకు , మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ప్రయత్నించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేశాయి. ఇందుకొసం చొటా రాజన్ ఉన్న తీహార్ జైల్లొనే ఖైదీగా ఉన్న డిల్లీ గ్యాంగస్టర్ నీరజ్‌ బవానా కు సుపారి ఇచ్చినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేశాయి. ఇంతకు ముందే ఈ విషయాన్ని పసిగట్టిన ఇంటెలిజెన్స్, వెంటనే నీరజ్‌ను వేరే జైలుకు తరలించారు. అయితే బెయిల్ పై విడుదలైన నీరజ్ బవానా, మద్యం సేవించి ఫొనులొ తన స్నేహితునితొ ఈ విషయం బయటపెట్టినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేశాయి.
 
నిజానికి చొటా రాజన్, దావూద్ ఇబ్రహీం గ్యాంగులొ కీలక సభ్యుడే. అయితే 1993 ముంబాయి పెళ్లుళ్ల తరువాత చొటా రాజన్, దావూద్ ఇబ్రహీం తొ విభేదించించాడు.  ప్రధానంగా హిందువులను టార్గెట్ గా చేసుకుని ఈ పేళ్ళుళ్ళు జరపడంతొ చొటా రాజన్, దావూద్ ఇబ్రహీం కు ఏదురుతిరిగాడు. విభేదించడమే కాకుండా ఆ పేళ్ళుళ్ళలొ కీలక సబ్యులైన సలీం కుర్లా, మొహమ్మద్ గింద్రన్, మాజిద్ ఖాన్ లను చొటా రాజన్ హత్య చేశాడు. దీనితొ చొటా రాజన్, దావుద్ ఇబ్రహీం ల మద్య గ్యాంగ్ వార్ మొదలైంది. దాదాపు 20 సంవత్సరాల నుండి దావూద్ ఇబ్రహీం, చొటా రాజన్ ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.
 
అయితే దావూద్ ఇబ్రహీం తొ విభేదించిన దగ్గరి నుండి చొటా రాజన్, దావూద్ రహస్య కార్యకలాపాల గురించి భారత ఇంటెలిజెన్స్ కు అందజేస్తూ, ఇంటెలిజెన్స్ కు దగ్గరయ్యాడు. అయితే ఈ మద్య కాలంలొ చొటా రాజన్ తనకు తానుగా ఇండియన్ పొలీసులకు లొంగిపొయాడు. అప్పటి నుండి చొటా రాజన్ ను తీహార్ జైల్లొ ఉంచడంతొ, చొటా రాజన్ ను తీహార్ జైల్లొనే డిల్లీ గ్యాంగస్టర్ నీరజ్ బవానా ద్వారా హత్య చేయించేదుకు దావూద్ కుట్ర పన్నాడు. అయితే ఇంటెలిజెన్స్ ముందుగా కనిపెట్టడంతొ దావూద్ ప్లాన్ ఫెయిల్ అయ్యింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!