91 ఏళ్ళ వరకు తన జీవితాన్ని ప్రజల కొసమే త్యాగం చేసిన మహాతల్లి “డాక్టర్ భక్తి యాదవ్’

Share the Post
91 ఏళ్ల వయసులొ కూడా వణుకుతున్న చేతులతొ ఏజెన్సీ ప్రాంతంలొని మహిళలకు ఉచితంగా వైద్య సేవలందించిన మహా తల్లి. డాక్టర్ పట్టా స్వీకరించిన దగ్గరి నుండి, చనిపొయే వరకు 68 ఏళ్ళ పాటు పేద మహిళలకు వైద్యం చేసిన గొప్ప సేవా మూర్తి … ఆమే డాక్టర్ భక్తి యాదవ్.
 
1926 లొ మధ్యప్రదేశ్ లొ జన్మించిన భక్తి యాదవ్ గారు, 1948 నాటికి మహాత్మాగాంధి మెడికల్ కాలేజి లొ MBBS కొర్సు పూర్తి చేశారు. దీనితొ మద్యప్రదేశ్ లొ మొదటి మహిళా డాక్టరు గా భక్తి యాదవ్ రికార్డు సృష్టించారు. MBBS పూర్తి చేయగానే యాదవ్ గారికి పెద్ద జీతంతొ, ఇండొర్ లొని పెద్ద ప్రభుత్వ హాస్పటల్ లొ ఉద్యొగం వచ్చినప్పటికీ దానిని తిరస్కరించి, పేద వస్త్ర కార్మికుల భార్యలకు సేవచేసేందుకు గైనకాలజిస్టు అయిన భక్తియాదవ్ గారు “నందలాల్ భండారి మెమొరియల్ హొం” లొ వైద్యురాలిగా వృత్తిని స్వీకరించారు.
 
అప్పటి నుండి పేద ప్రజలందరికీ పూర్తిగా ఉచిత వైద్యం చేయడం మొదలుపెట్టారు. ఇందుకొసం ఆమె ఏదురు ఖర్చు పెట్టుకుని మరీ ఏజెన్సీలకు, అడవులకు, కొండ ప్రాంతాలకు వెళ్ళి ఉచితంగా సేవలు అందించేవారు. ప్రభుత్వాలతొ మాట్లాడి మద్యప్రదేశ్ లొ ఏక్కువగా ఉండే ఏజెన్సీ ప్రాంతాలకు ఉచిత మందులు పంపిణీ చేయించేవారు. తన శక్తి మేరకు 91 ఏళ్ళ వయస్సు వరకు కూడా భక్తి యాదవ్ గారు వణుకుతున్న చేతులతొ ఉచిత వైద్యం అందించారు. ముక్యంగా పేషంట్లను తన కుటుంబ సబ్యులుగా భావించి వైద్యం అందించేవారట. అందుకే అందరు భక్తి యాదవ్ ను ప్రేమగా “దిది” అని పిలుస్థారు. ఇంత చేస్తూ కూడా ఏనాడు పబ్లిసిటీ కొరుకొలేదు. ఏటువంటి స్వార్ధం లేని ఆమె సేవలను గుర్తించి 2017 లొ కేంద్రప్రభుత్వం భక్తి యాదవ్ గారికి పద్మశ్రీ బహుమతి ప్రకటించే వరకు భక్తి యాదవ్ గురించి ఏక్కువ మందికి తెలియక పొవడం శొచనీయం.
 
ఒక భారతీయురాలిగా తన భాద్యతను గొప్పగా నిర్వహించి, కొన్ని లక్షల మంది పేద మహిళలకు ఉచితంగా వైద్యం అందించిన దిది ఈ సంవత్సరం ఆగస్టు లొ అందరినీ వదిలేసి తిరిగిరాని లొకాలకు వెళ్ళిపొయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!