ఫలించిన భారత దౌత్యం : దారిలొకి వచ్చిన మాల్దీవులు, బెడిసి కొట్టిన చైనా ప్యూహం

Share the Post
మాల్దీవులు, ఆసియా లొ చైనా బారిన పడిన దేశాలలొ రెండవది .. మొదటిది శ్రీలంక కాగా, రెండవది మాల్దీవులు. సరిగ్గా భారతదేశానికి దక్షిణాన, హిందూ మహా సముద్రం మద్య భాగంలొ ఉన్న మాల్దీవులు నైసర్గికంగా, ప్రపంచ వ్యాపార వాణిజ్యాలకు అత్యంత అనుకూలమైన గొప్ప ప్రాంతం (Great Point) లొ ఉంది. అయితే ఈ ప్రత్యేకతే ఆ దేశానికి శాపంలా పరిణమించింది.
 
ఎప్పటి నుండొ హిందూ మహా సముద్రం పై ఆధిపత్యం సంపాదించి, భారత్ ను Roundup చేయాలని చూస్తున్న చైనా కు, హిందూ సముద్ర దేశమైన మాల్దీవులు మంచి అవకాశంగా కనిపించింది. పైగా ఆ దేశ పేదరికం, రాజకీయ అస్తిరత్వం చైనాకు అయాచిత వరం లా పరిణమించాయి. అంతే చైనా ఇక మాల్దీవుల పై వల విసరడం మొదలుపెట్టింది. పెద్ద ఏత్తున ఋణాలు ఇచ్చింది. మాల్దీవులలొని మీడియా, ముఖ్యనేతలతొ పాటు తొ సహా ప్రభుత్వ విభాగాలన్నింటిని తన చెప్పు చేతలలొకి తెచ్చుకున్న చైనా, మాల్దీవుల ప్రభుత్వంతొ బలవంతంగా Free trade agreement కు అంగీకరించేలా ఓపందం కురుర్చుకుని, చట్టం చేయించింది. ఈ విషయంలొ కనీసం ప్రతి పక్షం, ప్రజల విశ్వసాన్ని కూడా పరిగణనలొకి తీసుకొనివ్వలేదు.
 
అయితే ఈ ఓప్పందం భారత్ కు శాపంగా పరిణమించడంతొ దీనిని వ్యతిరేకంగా మొది ప్రభుత్వం పావులు కదపడం మొదలుపెట్టింది. ఇందు కొసం మాల్దీవులు కౌన్సిలర్లతొ రహస్య చర్చలు ప్రారంభించింది. ఇది గమనించిన చైనా, మాల్దీవులను భారత్ కు శాశ్వతంగా దూరం చేయడానికి మాల్దీవులు ప్రభుత్వం పై ఓత్తిడి చేసి ఆ కౌన్సిలర్లను సస్పెండ్ చేయించింది. అంతేకాకుండా ప్రభుత్వానికి దగ్గరగా ఉండే మీడియాలొ మొది, ముస్లిం లకు వ్యతిరేకమని, భారత్ మాల్దీవులకు శత్రువని, చైనా మిత్రదేశమని వార్తలు గుప్పించ్చింది. ఈ రెండు చర్యలతొ భారత్, మాల్దీవుల మద్య విభేదాలు పెరిగాయి.
 
అయితే జరుగుతున్న ప్రతి విషయాన్ని గమనిస్తున్న మొది ప్రభుత్వం, దీని కంతటికీ కారణం ఏవరొ తెలుసు కాబట్టి, ఈసారి నేరుగా మాల్దీవుల అధ్యక్షుడు అబ్ధుల్లా యమీన్, మరి కొందరు ముఖ్యులతొ చర్చలు జరిపి మాల్దీవులను, భారత్ కు అనుకులంగా ఉండేలా లైన్లొకి తెచ్చారు. ఆదివారం మాల్దీవుల అధ్యక్షుడు అమీన్ మాట్లాడుతూ, భారత్ మాకు ఏప్పటికీ మిత్రదేశమని, ఏప్పటికీ భారత్ ను వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. మేము భారత్ తొ కూడా చైనాతొ వలే Free Trade ఓప్పదం చేసుకొవాలనుకుంటున్నామని, తమ పరిస్థితిని (ఋణాలు) అర్ధం చేసుకొవాలని భారత్ కు విగ్ణప్తి చేశారు. భారత్ తొ మరింతగా సంబందాలు మెరుగుపరచుకొవడానికి భారత్ కు High Level Team ను పంపినట్టు తెలియజేశారు.
 
దీనితొ మాల్దీవులను, భారత్ కు శాశ్వతంగా దూరం చేద్దామనుకున్న చైనా ప్రయత్నాలు బెడిసికొట్టాయి. భవిష్యత్తులొ మరిన్ని మార్పులు జరిగే అవకాశం కనబడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!