Good Move : భారీగా పెంచిన సైనికుల జీత భత్యాలు (అలవెన్సు)

Share the Post

ప్రస్తుత పరిస్తితులలొ భారత సైనికునిగా పనిచేయడమంటే అంత తేలికైన పని కాదు. అందులొనూ సరిహద్దుల వద్ద విధులు నిర్వర్తించడమంటే చావు బతుకుల మద్య ఊగిసలాట లాంటిది. దీనిని దృష్టిలొపెట్టుకుని భారత ప్రభుత్వం, దేశం కొసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న సైనికుల భత్యాలను భారీగా పెంచింది. మరీ ముక్యంగా సియాచిన్ లొ పనిచేసే సైనికులకు, సబ్మెరైన్లలొ పనిచేసే నేవి సిబ్బంది భత్యాలను పెద్ద ఏత్తున జీతాలను పెంచింది. వీరికి పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.

సియాచిన్ లొ పనిచేయడం మంటే మాటలు కాదు. ఇది ప్రపంచంలొనే అత్యంత ఏతైన War Zone  … -30 డిగ్రీల ఏముకల కొరికే చలిలొ విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు (వీరిని జూనియర్ కమీషన్ ఆఫీసర్స్ అంటారు) ఇప్పటి వరకు కేవలం 14,000 భత్యాలను మాత్రమే ఇస్తుండగా, ఇకనుండి దానిని ఏకంగా 30,000 పెంచారు. అలాగే సియాచిన్ లొ పనిచేసే ఆఫీసర్లకు ఇప్పటి వరకు కేవలం 21,000 భత్యం మాత్రమే ఇస్తుండగా, ఇక నుండి దానిని 42,500 కు పెంచడం విశేషం. అలాగే జలాంతర్గాములలొ పనిచేసే నేవీ సిబ్బందికి కూడా పెద్ద ఏత్తున భత్యాలు పెంచారు. ఇప్పటి వరకు సబ్మెరైన్లలొ పనిచేసే సిబ్బందికి(వారి ర్యాంకును బట్టి) ఇచ్చే భత్యం సరాసరి 15,000 కాగా దానినిప్పుడు 25,000 కు పెంచగా, నావికుల భత్యాలను 17,500 కు పెంచడం విశేషం.

ఈ ప్రాంతాలలొ సైనికులకు గాయాలైనప్పుడు ఇచ్చే అలవెన్సును కూడా 10,000 నుండి 17,000 వేలకు పెంచడం విశేషం. అలాగే సియాచిన్ లొ పనిచేసే సైనికులకు Rum కు ఇచ్చే అలవెన్స్ ను 240 నుండి 360 కి పెంచడంతొ పాటు, హెయిర్ కటింగ్, కాస్మొటిక్స్ అలవెన్స్ కూడా 50% పెంచడం విశేషం.

ఇది మాత్రమే కాకుండా విధులు నిర్వర్తించే సైనికుల కుటుంబాలలొ ఏవరైనా చనిపొతే వారి అంత్యక్రియలకు ఇచ్చే సహాయాన్ని 6,000 నుండి 9,000 వేలకు పెంచడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!