వాజపేయి గారి జన్మదినం సంధర్బంగా, ఆయన జీవితంలొని కొన్ని కీలకమైన విషయాలు మీకొసం

Share the Post

అజాత శత్రువు, పొరపాటున కూడా అవినీతి మకిల అంతని మహా నేత… కాంగ్రెస్సేతర ప్రధానిగా ఏక్కువకాలం ( 6 సంవత్సరాల 64 రొజులు) పనిచేసిన మొదటి వ్యక్తి వాజపేయ్ గారు మాత్రమే. 1924 లొ దిగువ మధ్య తరగతి కుటుంబంలొ జన్మించిన వాజపేయ్ గారు, 1939 లొ RSS  లొ జాయిన్ అయ్యారు. అప్పటి నుండి అంచలంచలుగా ఏదుగుతూ ప్రధాని పదవిని అధిష్టించారు. వివాహం కూడా చేసుకొకుండా జీవితం మొత్తాన్ని దేశానికే అంకితం చేసిన మహా పురుషుడు. 1942 లొ క్విట్ ఇండియా ఉద్యమంలొ పాల్గొని 23 రొజుల పాటు జైలు జీవితం గడిపారు. 1968 లో అప్పటి జనసంఘ్ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా ఎదిగారు.

పొఖ్రాన్ అణు పరీక్షల ద్వారా దేశాన్ని పూర్తిస్థాయి అణ్వస్త్ర దేశంగా మార్చిన ఘనత ఆయన సొంతం. అత్యంత రహస్యంగా పొఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించి అమెరికాతొ పాటు, ప్రపంచ దేశాలన్నింటినీ బిత్తరపొయేలా చేశారు. అత్యంత ఖటినమైన, దాదాపు అసాధ్యమైన కార్గిల్ యుధంలొ పాకిస్థాన్ ను ఓడించి, భారత దేశ సత్తాను ప్రపంచానికి తెలియజేశారు. 17,000 అడుగుల ఏత్తున ఉన్న శత్రువును ఓడించడం భారత ఆర్మీకి సాధ్యం కాదని, ప్రపంచ దేశాలన్నీ భయపెట్టినప్పటికీ, నిరుత్సాహపరచినప్పటికీ మన ఆర్మీ సామర్ధ్యం పై నమ్మక ముంచి కార్గిల్ యుధంలొకి తిరుగులేని విజయాన్ని దేశానికి అందించారు. 2000 సంవత్సరంలొ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ను భారత పర్యటనకు రప్పించి, అమెరికా_భారత్ దేశాల మద్య సంబందాలను పునరుధరించారు.

భారత విదేశాంగశాఖా మంత్రిగా ఐక్యరాజ్యసమితిలొ మొట్తమొదటిసారి, భారత జాతీయ భాష హింది లొ ప్రసంగించి అందరి ప్రశంసలు పొందారు.  అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి కాంగ్రెస్ హయాంలొనే 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గానూ భారత ప్రభుత్వం డిసెంబర్ 24, 2014లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు.  ఆయన పుట్టినరోజు అయిన డిసెంబర్ 25 ను సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది.  వాజపేయి గారికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ 2015 మార్చి 27 న ప్రదానం చేశారు. అనారోగ్యంతో పూర్తిగా మంచంపై ఉన్న వాజపేయి గారికి భారత రత్న ప్రదానం చేయడానికి స్వయంగా రాష్ట్రపతే, వాజపేయి గారికి నివాసానికి తరలిరావడం విశేషం.

One thought on “వాజపేయి గారి జన్మదినం సంధర్బంగా, ఆయన జీవితంలొని కొన్ని కీలకమైన విషయాలు మీకొసం

  • January 12, 2018 at 4:02 am
    Permalink

    Very good news. Please continue to provide such news. Thank you Sir.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!