మోదీ ప్రభుత్వం ఎందుకు FRDI బిల్ తీసుకురావాలనుకుంటుంది?

Share the Post

ఇది చెప్పాలంటే మనం అమెరికా స్టోరికి వెళ్ళాలి. అమెరికాలో 2008 కాలంలో సబ్ ప్రైమ్ క్రైసిస్ తో అమెరికా బ్యాంకులు దివాలా తీసాయి. ఎక్కడన్న బ్యాంకులు దివాలా తీస్తే ఎమైనా ఉందా. ఆ దేశ ఆర్దిక వ్యవస్థ పతనం మొదలవుతుంది. సరిగ్గా అమెరికాలో ఇదే జరిగింది. ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ తిరొగమన దిశలొకి వెళ్ళింది. దీని వలన అమెరికా ఆర్దిక మాంద్యంలోకి వెళ్ళిపోయింది (డిసెంబర్ 2007 – జూన్ 2009).

అదంతా సరే ఇప్పుడు మన దేశానికి వచ్చేద్దాం. మన దేశంలో భ్యాంకులు దివాలా తీయలేదు, కాని కాంగ్రేస్ పుణ్యంతో ఈ కల సాకారం కావచ్చింది. కాంగ్రెస్ హయాంలొ అప్పులు పారిశ్రామిక వేత్తలకు ఇవ్వవలసిన దానికన్నా విపరీతంగా ఇవ్వడంతొ బ్యాంకులలో మొండి బకాయిలు విపరీతంగా పెరిగిపొయాయి. ఆ విషయాన్ని ఇప్పుడు మోదీ ప్రభుత్వం వెలుగులొకి తేవడంతొ, ఇప్పుడు అదే కాంగ్రేస్ పార్టీ రివర్స్ లొ మోదీగారి మీద బురదజల్లుడు కార్యక్రమం మొదలుపెట్టింది.

2009లో విజయ్ మాల్య కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నికర నష్టం 1600 కోట్లు. అదే సంవత్సరం IDBI బ్యాంక్ 900 కోట్లు ఇచ్చింది. ఇదే బ్యాంక్ అంతకముందు మాల్యాకు లోన్ తిరస్కరించింది. దీని వెనకాల ఏ రాజకీయశక్తులు ఉన్నాయో మీరే ఆలోచించాలి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే IDBI Bank, మాల్యాకు లోన్ కి షూరిటి స్తిర ఆస్తులు మీద కాకుండా చరాస్తుల మీద ఇచ్చింది. మాల్యా ఇలాగే SBI దగ్గర కూడ తీసుకున్నాడు. కాంగ్రెస్ పాలనలో ఇలా ఎంతోమంది మాల్యాలు తయారయ్యారు.దీని ప్రతిఫలమే నేటి బ్యాంకుల మొండి బకాయిలు.

ఈ మొండి బకాయిలు వలన దేశ ఆర్ధక వ్యవస్థ అభివృద్ధికి కొట్టుమిట్టాడుతుంది. ఇదే మొండి బకాయిలు లేకుండా ఉండి ఉంటే మన వృద్ధి రేటు 10% పైమాటే. అందుకే FRDI బిల్లు రావాలి, దీని క్రింద Resolution Corporation ఏర్పాటు చేసి బ్యాంకులను ఎప్పటికప్పుడు తప్పటి అడుగులు వేయకుండా పర్యవేక్షిస్తుంది.

ఏదైనా బ్యాంక్ లు, పై చెప్పిన రిస్క్ లోకి వస్తే వెంటనే వీటి మీద చర్యలు చేపట్టి, ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం కాకుండా ఉండడానికే మోదీ గారు ఈ బిల్లును తెరపైకి తెచ్చారు. ఇప్పటివరకు ఈ చట్టం క్రింద లక్ష రూపాయలవరకు డిపాసిటర్స్ కి సెక్యూరిటి ఉంటుంది. ఈ లక్ష రూపాయల సెక్యురిటి అనేది నిర్ణయించింది 25 సంవత్సరాల క్రితం తయారు చేయబడిన చట్టం..

ఐతే కొత్తగా వచ్చే బిల్లులో ఇది ఎంత అనేది తెలియదు.బిల్లు పార్లమెంటులోకి రాకుండా మీడియా వాళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఇదే విషయం పై పార్లమెంటులో ఆర్ధిక మంత్రి జైట్లీ స్పందిస్తూ, ప్రజల సొమ్ముకు ఎటువంటి ప్రమాదం లేదని తెలియజేసారు, ప్రభుత్వం డిపాజిట్ సొమ్ముకు రక్షణ కల్పిస్తుంది అని చెప్పారు. అలాగే ప్రధాని మోదీ గారు కూడా మధ్యతరగతి, పేద ప్రజలకు ఏటువంటి నష్టం కలగదని హామి ఇచ్చారు.

 

One thought on “మోదీ ప్రభుత్వం ఎందుకు FRDI బిల్ తీసుకురావాలనుకుంటుంది?

  • December 26, 2017 at 8:14 am
    Permalink

    దీని గురుంచి ఇంకాస్త డీటెయిల్ గా చెప్పండి,ఇప్పటికే చాలా ఛానల్ లు ముఖ్యంగా టీవీ9 భయపెడుతోంది,బ్యాంక్ లో ఉన్న డబ్బులు డ్రా చేయమంటుంది,

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!