మొదటిసారి ఒక భారత ప్రధానిని ముఖ్య అతిధిగా ఆహ్వానించిన “వరల్డ్ ఏకనమిక్ ఫొరం”

Share the Post
మొదటిసారి ఒక భారత ప్రధానిని “వరల్డ్ ఏకనమిక్ ఫొరం” ముఖ్య అతిధిగా ఆహ్వానించింది. ప్రతి సంవత్సరం స్విడ్జర్లాండ్ లొని దావొస్ లొ జరిగే ప్రపంచ ప్రఖ్యాత “ప్రపంచ ఆర్ధిక సదస్సుకు” కు ముఖ్య అతిధిగా నరేంద్రమొది గారిని ఆహ్వానించారు. ఒక భారత ప్రధానిని ఈ ఆర్ధిక సదస్సుకు ముఖ్య అతిధిగా పిలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
 
వ్యాపార పరంగా, ఆర్ధికంగా, పారిశ్రామికంగా ప్రపంచ దేశాల స్థాయిని పెంచడం కొసం 1971 లొ స్విడ్జర్లాండ్ లొ ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. ప్రతి సంవత్సరం దావొస్ లొ జనవరి నెలలొ ఈ ప్రపంచ ఆర్ధిక సదస్సు జరుగుతుంటుంది. 2018 సంవత్సరానికి గాను జనవరి 23-26 వరకు జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సు కు ఈసారి భారత ప్రధాని నరేంద్రమోది గారిని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. మొత్తం 3,000 మంది పారిశ్రామికవేత్తలు, ఆర్ధికనిపుణులు, వివిధ దేశాల అధినేతలు పాల్గొననున్న ఈ సదస్సుకు మొది గారు జనవరి 24 వ తారీకున హాజరయ్యే అవకాశం ఉంది.
 
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఆర్ధిక సదస్సుకు ప్రధాని మొది గారు పెద్ద సంఖ్యలొ భారతీయ ప్రముఖులను తీసుకుని ఒక యుధానికి వెళ్ళినట్టు వెళుతున్నారు. మొది గారు తనతొ పాటు 100 మంది పారిశ్రామిక వేత్తలను, CEO లను, బాలివుడ్ సెలబ్రిటీలను, కేంద్ర మంత్రులను, ఇతర భారత ఆర్ధిక వేత్తలను తీసుకుని వెళుతుండటం విశేషం. ఈసారి జరిగే వరల్డ్ ఏకనమిక్ ఫొరం ఏక్కువ మంది భారతీయులతొ కళ కళ లాడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!