Superb News : Big boys Defence club లొ చేరిన భారత్

Share the Post

భారత్ మరొక గొప్ప హొదాను సంపాదించింది. డిఫెన్స్ కు సంబందించిన కీలకమైన వాసెనర్ గ్రూఫ్ లొని Club of Participating States (PSs) లొ భారత్ జాయిన్ అయ్యింది. ప్రపంచంలొ అత్యున్నత స్థాయి డిఫెన్స్ టెక్నాలజీలను కలిగి ఉన్న 41 దేశాలు సబ్యులుగా ఉన్న ఈ డిఫెన్స్ క్లబ్బులొ భారత్ 42 వ దేశంగా చేరడం విశేషం.

ప్రధానంగా ఈ వాసెనర్ గ్రూఫ్ లొని దేశాలు దేశీయంగా, అంతర్జాతీయంగా రక్షణవ్యవహారాలను నిర్వహిస్తుంటాయి. ఈ గ్రూఫ్ లొ దేశాలు ఆయుధాలు, టెక్నాలజీని ఒకదానికొకటి బదిలీ చేసుకుంటాయి. ఈ గ్రూఫ్ లొ చేరబడిన కొత్త దేశాలకు, ఈ గ్రుఫ్ లొని సభ్య దేశాలు అధునాతన ఆయుధాలను, టెక్నాలజీలను సరఫరా చేయడం ద్వారా ఆయా దేశాలను శక్తివంతమైన డిఫెన్స్ సామర్ధ్యం ఉన్న దేశాలుగా తీర్చిదిద్దుతాయి. ఆ దేశాలను శక్తివంతమైన మిలటరీ దేశాలుగా తయారుచేస్థారు

ఈ వాసెనర్ గ్రూఫ్ లొ జాయిన్ అవడం ద్వారా భారత్, ప్రపంచ రక్షణ పరిపాలనా వ్యవస్థలొ చేరినట్లయింది. భారత్, ఈ గ్రూఫ్ లొ జాయిన్ అవడం ద్వారా తీవ్రవాదులకు, తీవ్రవాద సంస్థలకు, వారికి సహాయం చేసే దేశాలకు ఆయుధాలు, టెక్నాలజి, ఇతర పరికరాలు సరఫరా కాకుండా అడ్డుకొవచ్చు. అంతేకాకుండా భారత్ , అత్యున్నత స్థాయి టెక్నాజీలతొ పాటు, అధునాతన ఆయుధాలను, ఇతర డిఫెన్స్ పరికరాలను పొందగలుగుతుంది. తద్వారా భారత్ రక్షణ పరికరాలను, ఆయుధాలను స్వదేశీయంగా భారత్ లొనే తయారుచేసుకొవడమే కాకుండా, వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం కలుగుతుంది.

అనేక సంవత్సరాల నుండి చైనా ఈ గ్రూఫ్ లొ జాయినవడానికి ప్రయత్నించినప్పటికీ, ఇంతవరకు ఈ గ్రూఫ్ లొ స్థానం సంపాదించలేక పొయింది. కాని చైనా కన్నా ముందుగా భారత్ ఇప్పుడు ఈ గ్రూఫ్ లొ సభ్యదేశంగా చేరడం విశేషం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!