కాశ్మీర్ సమస్యను పరిష్కరించగల సత్తా మోదీగారికి మాత్రమే వుంది

Share the Post

70 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న జమ్మూ కాశ్మీర్ సమస్యను ప్రధాని మోదీ ఒక్కరే పరిష్కరించగలరని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. జమ్మూలోని ఓ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.కాశ్మీర్ సమస్యను ఎవరైనా తీర్చగలరు అంటే అది మోదీఒక్కరికే సాధ్యమని కొనియాడారు.

ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా దేశమంతా మద్దతుగా నిలుస్తుందని ముఫ్తీ అన్నారు. గత ప్రధాని పాకిస్థాన్‌ లో పర్యటించాలని అనుకున్నప్పటికీ అది సాధ్యపడలేదన్న ఆమె… మోదీ లాహోర్‌ వెళ్లారని.. అదే ఆయన సామర్థ్యానికి నిదర్శనంగా అభివర్ణించారు.

తన తండ్రి దివంగత సీఎం మహ్మద్‌ సయీద్‌, మాజీ పీఎం అటల్‌ బిహారీ వాజ్‌ పేయ్‌ భారత్‌, పాక్‌ మధ్య సంబంధాలను మెరుగుపరిచారని ముఫ్తీ చెప్పారు

One thought on “కాశ్మీర్ సమస్యను పరిష్కరించగల సత్తా మోదీగారికి మాత్రమే వుంది

  • December 24, 2017 at 2:18 am
    Permalink

    That is modi’s confidence on his work, proud of our nation, create and build as a diamond of R.S.S. organisation

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!