Superb News : తవ్వకాలలొ బయట పడుతున్న పాండవుల రాజాధాని ఇంద్రప్రస్థ

Share the Post
ఇంద్రప్రస్థ – పూర్వం మన దేశంలొ ఉన్న పదహారు మహాజనపధాలలొ ఇది ఒకటి. యమునా నదికి పశ్చిమాన ఉన్న ఖాండవ అడవులను దహనం చేసి పాండవులు ఈ ఇంద్రప్రస్థ రాజ్యాన్ని నిర్మించారు. తరువాత ఈ నగరం చాలకాలం పాటు పాండవుల, కౌరవుల రాజధాని నగరంగా భాసిల్లింది.
ప్రస్తుతం డిల్లీ దగ్గరలొ ఉన్న ఈ ప్రాంతాన్ని ఇంద్రపట్ అని పిలుస్తున్నారు. సరిగ్గా ఈ ప్రాంతంలొ ఉన్న పురానా ఖిల్లా లొ మహా భారతకాలం నాటి వస్తువులు లభించడంతొ గత వారం రొజుల నుండి ఇక్కడ తవ్వకాలు మొదలు పెట్టారు. నిజానికి 1960 లొ జరిగిన తవ్వకాలలొనే ఈ ప్రాంతాన్ని ఆనాటి ఇంద్రప్రస్థ గా ఆర్కియాలజి డిపార్టుమెంట్ గుర్తించింది. అయితే ఈ మద్య కాలంలొ ఇక్కడ మహాభారతకాలం నాటి వస్తువులు లభ్య మవడంతొ మరలా ఇక్కడ తవ్వకాలు ప్రారంభించారు. ప్రస్తుతం ఇంద్రప్రస్థ కొట గొడల కొసం త్రవ్వకాలు ప్రారంభించారు.
ఇప్పటి వరకు ఆర్కియాలజి డిపార్టుమెంటు వారికి ఇక్కడ జరిపిన తవ్వకాలలొ 300 కాలం నాటి (మౌర్యుల కాలం నాటి) పూసలు, మణులు, బొమ్మలు, … తరువాత ఈ ప్రాంతాన్ని పాలించిన షుంగుల కాలం నాటి యక్షుల ప్రతిమలు, ఏరుపురంగు శిల్పాలు …. ఆ తరువాత పరిపాలించిన కుషాణుల శపధాలు, రాగి నాణేలు, ట్యాంకులు …. తరువాత పరిపాలించిన గుప్తుల కాలం నాటి శాసనాలు, నాణేలు …. తరువాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన సుల్తానులకు చెందిన పగడాలు, స్పటికాలు, మెరుసే ఫలకాలు, పూసలను … మొగలుల కాలం నాటి బంగారు చెవి పొగులు, వైన్ బాటిల్స్,పింగాణి వస్తువులను కనుగొన్నారు.
దీని గురించి ఆర్కియాలజి డిపార్టుమెంట్ సూపర్నెంట్ “వసంత కుమార్ స్వర్నాకర్” మాట్లాడుతూ ” ఇప్పటికే మహాభారత కాలం నాటి కుండలు, విడి భాగాలు, భద్రపరిచే పెట్టెలు లభ్యమయినందు వలన, మేము ప్రధానంగా ఆనాటి ఇంద్రప్రస్ఠ నగరానికి రక్షణగా ఒకదానిపై ఓకటిగా కట్టిన ప్రహారి కొట గొడల కొసం తవ్వకాలు జరుపుతున్నము, వీటిని గుర్తించడం కొసం పాతకాలం నాటి డ్రాయింగులను, చిత్రాలను కూడా ఊపయొగిస్తున్నట్టూ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!