అజిత్ ధొవల్ చాణక్యం – కాశ్మీరులొ 90% తగ్గిన Stone Pelting సంఘటనలు

Share the Post
మొత్తానికి “Doval Doctrine” అద్భుత ఫలితాలను ఇచ్చింది. కాశ్మీరు లొయలొ Stone Pelting సంఘటనలు ఊహించని విధంగా తగ్గిపొయి, శాంతి భద్రతలు అదుపులొకి వచ్చాయి. పొయిన సంవత్సరంతొ పొల్చుకుంటే దాదాపు 90% Stone Pelting సంఘటనలు తగ్గిపొవడం విశేషం. 2016 లొ ప్రతి శుక్రవారం రొజున 40 నుండి 50  Stone Pelting  సంఘటనలు జరిగే పరిస్థితి నుండి కాశ్మీరు మరలా సాధారణ స్తితికి చేరుకుంది.
 
ముఖ్యంగా “హిజబుల్ ముజాహిద్దీన్” కమాండర్ “బుర్ఖాన్ వాణి” ని మన భద్రతా దళాలు Encounter చేసిన దగ్గర నుండి Stone Pelting సంఘటనలు తీవ్రరూపం దాల్చాయి. వేర్పాటువాద నాయకులు, కాశ్మీరి యువతకు పాకిస్థాన్ ముద్రించిన దొంగ 500, 1000 నొట్లను పంచుతూ కాశ్మీరులొ తీవ్ర ఉద్రిక్తలను స్రుష్టించారు. కాశ్మీరు లొయలొ పూర్తిగా అశాంతి వాతావరణం నెలకొంది. సరిగ్గా నవంబరులొ భారత ప్రభుత్వం పెద్ద నొట్లను రద్దు చేయడంతొ, ఒక్కసారిగా పరిస్తితులు మారిపొయాయి. అటు తీవ్రవాదులు, ఇటు వేర్పాటువాదులు డబ్బుల కొసం కట కట లాడాల్సి వచ్చింది. చివరకు పొన్ రీచార్జ్ చేయించుకొవడానికి కూడా డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఏదుర్కొన్నారు.
 
దీనితొ దొంగ నొట్ల చెలామణికి పులుస్టాప్ పడటంతొ పాకిస్థాన్, కాశ్మీరులొని వేర్పాటువాదులకు డబ్బులు అందజేయడానికి సరికొత్త మార్గాలను ఎంచుకుంది. వ్యాపారస్తుల ద్వారా, హొటల్స్ ద్వారా, సరిహద్దులలొ వ్యాపారం చేసే పండ్ల వ్యాపారుల ద్వారా హవాలా మార్గంలొ డబ్బును వేర్పాటువాదులకు అందించసాగింది. ఇది కనిపెట్టిన NIA , రంగంలొకి దూకింది. పెద్ద ఏత్తున దాడులు నిర్వహిస్తూ, దాదాపు వేర్పాటువాదులకు నిధులు అందే అన్ని మార్గాలను మూసివేసింది. వేర్పాటువాద నాయకులను అరెస్టు చేసింది. Stone Pelters ను సమీకరించడానికి ఉపయొగిస్తున్న వాట్సాప్ గ్రూఫ్ లను కనిపెట్టి, వాటిని బ్లాక్ చేయడమే కాకుండా, అడ్మిన్లందరినీ అరెస్టు చేసింది.
 
దీనికి తొడు కాశ్మీరులొ ఇండియన్ ఆర్మీ Operation Allout ప్రారంభించింది. పక్కా ప్లాన్ ప్రకారం పెద్ద పెద్ద కమాండర్లను, ముఖ్యనేతలను టార్గెట్ చేస్తూ Encounter చేయడం మొదలుపెట్టింది. ఏప్పుడూ లేనంత దూకుడుగా వ్యవహరిస్తూ నివాస ప్రాంతాలలొ దాక్కున తీవ్రవాదులను కూడా వేటాడటం మొదలు పెట్టారు.. దీనితొ అన్ని రకాలుగా దారులు మూసుకుపొవడంతొ చచ్చినట్టు శాంతి భద్రతలు అదుపులొకి వచ్చాయి. ఏక్కడొ ఒకటి తప్ప Stone Pelting సంఘటనలు దాదాపు అద్రుశ్యమై పొయాయి.
 
భారతంలొ శ్రీకృషుడు కనుక అన్నీ తానై ముఖ్యపాత్ర పొషించినట్టు, ఈ భద్రతా చర్యలన్నింటి వెనుక అజిత్ ధొవల్ గారు ఉండి, ఏప్పటికప్పుడు ప్యూహాలు రచిస్తూ, మంత్రాంగం నడిపి కాశ్మీరులొ మరల శాంతి భద్రతలను సాధారణ స్తితికి తీసుకు వచ్చేలా కృషిచేశారు. దీనినే “Doval Doctrine” అంటారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!